పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు..! కట్ చేస్తే దిమ్మతిరిగిపోయే మోసం.. హైదరాబాద్‌లో రూ.500 కోట్ల భారీ ఫ్రాడ్
ఈ యాప్ ద్వారా 10వేల మంది ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు బాధితులు తెలిపారు. మూడు నెలల వరకు సజావుగా ఇన్వెస్ట్ చేసిన వారికి సంస్థ రెంటల్ డబ్బులు చెల్లించింది. ఆ తర్వాతి నుంచి..

Investment Cyber Fraud In Hyderabad
Cyber Fraud : సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మోసానికి తెరలేపుతున్నారు. తాజాగా సైబర్ మోసగాళ్లు ఓ యాప్ లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ 500 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డారని బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రోబోటిక్ మెషిన్స్ పై ఇన్వెస్ట్ మెంట్ చేస్తే రోజువారీగా రెంటల్ ఇస్తామని చెప్పడంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు.
ఈ యాప్ ద్వారా 10వేల మంది ఇన్వెస్ట్ మెంట్ చేసినట్లు బాధితులు తెలిపారు. మూడు నెలల వరకు సజావుగా ఇన్వెస్ట్ చేసిన వారికి సంస్థ రెంటల్ డబ్బులు చెల్లించింది. ఆ తర్వాతి నుంచి రెంటల్ ఇవ్వడం ఆపేశారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Also Read : మహాముదురు.. శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు, రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
”లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒక రోజుకు 10వేలు వస్తాయని చెప్పారు. స్టార్టింగ్ లో వచ్చాయి. అలా మూడు నెలలు వచ్చాయి. మూడు నెలలకు గాను రూ.30వేలు వచ్చాయి కదా అని.. మరో 50వేలు పెట్టుబడి పెట్టా. టోటల్ గా లక్ష 50వేలు ఇన్వెస్ట్ చేశాను. ఆ తర్వాత నుంచి డబ్బులు రావడం ఆగిపోయాయి. దాంతో మోసపోయామని తెలిసి షాక్ తిన్నాను. హైదరాబాద్ కి వచ్చి విచారిస్తే టోటల్ ఫ్రాడ్ అని తేలింది. ఇది ఫేక్ యాప్. ఇదే కదా ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయి. అవన్నీ ఫేక్. ఎవరూ ఇందులో ఇన్వెస్ట్ చేయొద్దు.. మోసపోవద్దు” అని ఓ బాధితుడు విజ్ఞప్తి చేశాడు.
అమాయకులను, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. యాప్స్ ద్వారా ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. పెట్టబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఊరిస్తారు, ఆశ పెడ్తారు. పొరపాటున కానీ వాటికి టెంప్ట్ అయ్యామో.. ఇక అంతే సంగతులు. కష్టపడి సంపాదించినదంతా పోగొట్టుకోవడం ఖాయం.
రోబోటిక్ మెషిన్లపై పెట్టుబడులు పెడితే భారీగా డబ్బులు చెల్లిస్తామంటూ ఆశ పెట్టారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 10వేల మంది పెట్టుబడులు పెట్టారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు 10వేలు రెంటల్ ఇస్తామని నమ్మించారు. అలా మూడు నెలల పాటు రెంటల్ ఇచ్చారు. ప్రతి నెల కచ్చితంగా రెంటల్ రావడంతో అందరికీ నమ్మకం పెరిగింది. మరింత డబ్బు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత అసలు మోసం వెలుగుచూసింది. రెంటల్ ఇవ్వడం మానేశారు. దీంతో తాము మోసపోయామని బాధితులు గొల్లుమన్నారు. సంస్థ నుంచి కానీ, యాప్ నిర్వహకుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు.
Also Read : వామ్మో.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వృద్ధుడిని పొడిచి పొడిచి చంపిన ఎద్దు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో
వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, తాము కట్టిన డబ్బు తమకు అందేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుల్లో కొందరు 10వేలు, మరికొందరు లక్ష రూపాయలు, ఇంకొందరు 3లక్షలు వరకు యాప్ లో ఇన్వెస్ట్ మెంట్ చేశారు. ముందుగా యాప్ లో ఇన్వెస్ట్ చేసిన 10వేల మందికి నమ్మకం కలిగించేందుకు వారికి మూడు నెలలుగా రెంటల్ చెల్లించారు. ఆ తర్వాత భారీగా పెట్టుబడులు రావడంతో ఆ డబ్బుతో ఉడాయించారు సైబర్ నేరగాళ్లు.