వామ్మో.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వృద్ధుడిని పొడిచి పొడిచి చంపిన ఎద్దు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

వృద్ధుడు నిర్జీవంగా రోడ్డుపై పడిపోయినప్పటికీ.. కోపంతో కాలు దువ్వుతూ ఎద్దు అతడిపై దాడి చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వామ్మో.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వృద్ధుడిని పొడిచి పొడిచి చంపిన ఎద్దు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

Bull Kills Elderly Man

Viral Video : వీధుల్లో తిరిగే పశువులు, వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు అటాక్ చేస్తున్నాయి. కుక్కలు, ఆవులు, ఎద్దులు యథేచ్చగా దాడులకు దిగుతున్నాయి. కుక్కులు కొరికి కొరికి చంపుతుంటే.. ఎద్దులు పొడిచి పొడిచి ప్రాణాలు తీస్తున్నారు. పశువులు, కుక్కల దాడుల్లో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలపాలవుతున్నారు. తాజాగా మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఓ వృద్ధుడిని ఓ ఎద్దు పొడిచి పొడిచి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ నగరంలో జరిగింది.

మృతుడిని కృష్ణానంద్ పాండేగా గుర్తించారు. ఆయన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వయసు 75ఏళ్లు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆయన రోజూ మార్నింగ్ వాక్ కు వెళ్తుంటారు. ఇదే క్రమంలో బుధవారం (జనవరి 24) కూడా ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒంటరిగా మార్నింగ్ కు వాక్ కు వెళ్లారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ ఎద్దు రెచ్చిపోయింది. అప్పటికే కోపంతో ఉన్న ఎద్దు.. ఒంటరిగా ఉన్న వృద్ధుడిని చూడగానే మరింత కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేసింది. కొమ్ములతో కుమ్మేసింది. ముందుగా అతడి పొట్టపై పొడిచింది. ఎద్దు బలంగా వచ్చి కొమ్ములతో గుద్దడంతో వృద్ధుడు అమాంతం ఎగిరి నేలపై పడిపోయాడు. అయినా ఆ ఎద్దు అతడిని వదల్లేదు. అతడిని పొడుస్తూనే ఉంది. చాలాసేపటి వరకు ఎద్దు అతడిని పొడుస్తూనే ఉంది. ఎద్దు దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు.

వృద్ధుడు నిర్జీవంగా రోడ్డుపై పడిపోయినప్పటికీ.. కోపంతో కాలు దువ్వుతూ ఎద్దు అతడిపై దాడి చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒంటరిగా వెళ్తున్న వృద్ధుడిని ఎద్దు పొడిచి పొడిచి చంపిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే హడలిపోతున్నారు.

వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను అదుపు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. వీధి పశువులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే అధికారులు మేలుకుంటారు? అని వారు అడుగుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి మరో ప్రాణం పోకముందే వీధి పశువుల కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పశువులను వీధుల్లోకి వదులుతున్న వాటి యజమానులను అరెస్ట్ చేయాలంటున్నారు.