చోరకళా నిపుణుడు.. ఫ్రమ్ సిద్దిపేట జిల్లా.. వీడు దొంగలకే గజదొంగ!

దుద్దెడ లింగం. ఫ్రమ్ సిద్దిపేట జిల్లా. వీడు దొంగలకే గజదొంగ. పోలీసులు ఇచ్చిన బిరుదు చోరకళ నిపుణుడు.

vizianagaram cops arrest thief and recovered silver ornaments

vizianagaram cops arrest thief : బ్యాచ్ నెంబర్ ఫోర్ టూ జీరో.. ట్రైన్డ్ ఇన్ రద్దీ ప్రదేశాలు. టాపర్ ఇన్ బ్యాచ్. దుద్దెడ లింగం. ఫ్రమ్ సిద్దిపేట జిల్లా. వీడు దొంగలకే గజదొంగ. పోలీసులు ఇచ్చిన బిరుదు చోరకళ నిపుణుడు. అదేంటి ఓ దొంగోడికి.. పోకిరీ రేంజ్లో ఇంటర్డక్షన్ ఇస్తున్నారనుకుంటున్నారా? కరెక్ట్ వీడు దొంగోడే. కాని.. ఇతగాడి చోరీ లీలలు తెలిస్తే ఇక్కడ ఇచ్చిన ఇంటర్ డక్షన్ కూడా తక్కువే అనుకుంటారు!

ఇక్కడ కనిపిస్తోన్న వ్యక్తి పేరు దుద్దెడ లింగం. సొంతూరు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా తట్టుపోతల బంగారం గ్రామం. ఇతగాడు విజయనగరం పట్టణంలో రెండు వేర్వేరు చోట్ల ఇళ్లల్లో దొంగతనాలు చేశాడు. దీంతో దుద్దెడ లింగంను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక ఖరీదైన రిస్టు వాచ్, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరంలోని బాలాజీ నగర్ ఇందూ రెసిడెన్షియల్లో ఆగస్టు 10న ఇంట్లోని వెండ వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆగస్టు 12న శ్రీనివాస కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో లక్ష విలువైన వాచీ, కొంత నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో దుద్దెడ లింగం అనే వ్యక్తిని విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

అయితే ఈ దుద్దెడ లింగం బ్యాగ్రౌండ్ గురించి పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇతగాడు తిరగని ఏరియా లేదు.. చూడని జైలు లేదు. చోరీలు చేయడం సరదా. అరెస్ట్ అయి జైలుకెళ్లడం షోకు. మళ్లీ తిరిగి వచ్చి దొంగతనాలు చేయడం మామూలే. అందుకే ఇతగాన్ని చోరకళ నిపుణుడు.. చోరకళ శిఖామణి అంటారట.

Also Read: మచిలీపట్నంలో కామాంధుడి పిచ్చి చేష్టలు.. మైనర్ ఆడపిల్లలే అతడి టార్గెట్..

దుద్దెడ లింగంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70కి పైగా చోరీ కేసులున్నాయి. రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవించి, ఐదు నెలల క్రితం బయటకు వచ్చిన లింగం.. తాజాగా మళ్లీ దొంగతనం చేసి కటకటాలపాలయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు