Arpita Mukherjee: కోర్టు విచారణలో బోరున విలపించిన పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ

బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.

Arpita Mukherjee: బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్టై, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో బోరున విలపించారు. బుధవారం ఈ కేసుకు సంబంధించి ఇద్దరినీ కోర్టు వర్చువల్ పద్ధతిలో విచారించింది. ఈ సందర్భంగా ఇద్దరూ కంటతడి పెట్టుకుని, ఆవేదన చెందినట్లు తెలుస్తోంది.

AP Assembly Session: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధాని అంశంపైనే ప్రధాన చర్చ

‘‘నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆందోళనగా ఉంది. నేనో ఎకనమిక్స్ స్టూడెంట్‌ను. మంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నాను. నేను రాజకీయ బాధితుడిని. నా ఇంటిని, నియోజకవర్గాన్ని పరిశీలించాలని ఈడీని కోరుతున్నా. నేను లా చదివాను. బ్రిటీష్ స్కాలర్‌షిప్ కూడా పొందాను. నా కూతురు బ్రిటన్‌లో చదువుతోంది. ఇలాంటి నేను కుంభకోణానికి పాల్పడతానా?’’ అని పార్థా ఛటర్జీ కోర్టులో అన్నారు. ఈ సందర్భంగా తాను ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నానని, ఏ కండీషన్‌తోనైనా బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరాడు. అనంతరం అర్పితా ముఖర్జీ కూడా విచారణకు హాజరయ్యారు.

Sourav Ganguly, Jay Shah: జై షా, సౌరవ్ గంగూలీకి సుప్రీంకోర్టు ఊరట.. పదవుల్లో తిరిగి కొనసాగేలా తీర్పు

‘‘ఇదంతా ఎలా జరిగిందో తెలియడం లేదు. నా ఇంటి నుంచి ఈడీ అధికారులు ఆ డబ్బును ఎలా స్వాధీనం చేసుకున్నారో కూడా తెలియట్లేదు. ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు గురించి నాకు తెలియదు. నేను మధ్య తరగతి కుటుంబానికి చెందినదాన్ని. నా తండ్రి లేరు. 82 ఏళ్ల తల్లి అనారోగ్యంతో ఉంది. నాలాంటి మధ్య తరగతి ఇంటి మీద ఈడీ ఎలా రైడ్ చేస్తుంది’’ అని అర్పిత కోర్టులో వ్యాఖ్యానించింది. దీనికి జడ్జి సమాధానమిస్తూ.. ఎక్కడైనా రైడ్ చేసే హక్కు ఈడీకి ఉంటుందని తెలిపింది. ఈ విచారణ సందర్భంగా ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు