WFI Chief Brij Bhushan Sharan Singh
WFI Chief Brij Bhushan Sharan Singh : భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై మరో వివాదం రాజుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన బ్రిజ్ భూషణ్ తాజాగా ఓ మహిళా రిపోర్టరు పట్ల అసభ్యంగా వ్యవహరించారు. బ్రిజ్ భూషణ్ పై నమోదైన కేసు చార్జిషీటుపై వ్యాఖ్యానించమని మహిళా విలేఖరి కోరినపుడు అతను మైక్రోఫోన్ పగలగొట్టాడు.
Kuno National Park : కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి..ఐదు నెలల్లో 7 చీతాల మృతి
ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. మహిళా విలేఖరి పట్ల అసభ్యంగా వ్యవహరించడంతోపాటు మైక్రోఫోన్ పగలగొట్టాడు. (Misbehaves With TV Reporter) చార్జిషీటుపై ప్రశ్నించిన మహిళా విలేఖరి పట్ల అనుచితంగా వ్యవహరించిన ఘటన సంచలనం రేపింది. చార్జిషీటు, బీజేపీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదు అని టీవీ విలేఖరి ప్రశ్నించడంతో ఆగ్రహం చెందిన బ్రిజ్ భూషణ్ మైక్ పగలగొట్టాడు. (Breaks Her Mic)
G Kishan Reddy : అమెరికా టూర్.. కన్ఫ్యూజన్‌లో కిషన్ రెడ్డి, కేబినెట్ విస్తరణపై రాని క్లారిటీ
ఈ కేసులో నిందితులైన మీరు ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని విలేఖరి ప్రశ్నించడంతో ఆగ్రహం చెందిన బ్రిజ్ భూషణ్ మైకును నేలకేసి కొట్టాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు పలు వర్గాల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం చూసిన వెంటనే బ్రిజ్ భూషణ్‌కు జైలు శిక్ష విధించాలని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు.
Somu Veerraju : 5వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు- వాలంటీర్ వ్యవస్థపై సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు
మహిళా విలేఖరి పట్ల బ్రిజ్ ప్రవర్తన బాగా లేదని అతను పార్లమెంటులో కాదని జైలులో ఉండాలని స్వాతి ట్వీట్ చేశారు. బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ కోర్టు నుంచి సమన్లు అందాయి. ఢిల్లీ కోర్టు జులై 18వతేదీన హాజరు కావాలని బ్రిజ్ భూషణ్ ను అభ్యర్థించింది. బ్రిజ్ భూషణ్ చర్యలను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రశ్నిస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ట్యాగ్ చేశారు. మహిళా జర్నలిస్టును వేధించడం, మైక్ పగలగొట్టడాన్ని శ్రీనివాస్ ప్రశ్నించారు.
हद है बेशर्मी और गुंडागर्दी की। चलते कैमरा पर #Brijbhushan एक महिला पत्रकार से ऐसी बदतमीज़ी कर रहा है। जिस तरह इस आदमी को बचाया गया इसका हौसला अब सातवें आसमान पर है। इसे पता है कुछ भी कर लो कोई कुछ नहीं बिगाड़ सकता… pic.twitter.com/NFA5CbFvJN
— Swati Maliwal (@SwatiJaiHind) July 11, 2023