Indian WhatsApp accounts banned
Indian WhatsApp Accounts Banned : భారత్‌లో మరో 23 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముందస్తుగా 10 లక్షలకుపైగా అకౌంట్లను బ్యాన్ చేశామని తెలిపింది.
Aadhaar-PAN Download : వాట్సాప్‌లోనే మీ ఆధార్, పాన్ కార్డు ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు తెలుసా?
నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉద్దేశించిన తమ ఫిర్యాదుల పరిష్కార చానెల్‌లో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ సంస్థ యూజర్ల ఖాతాలపై చర్యలు తీసుకుంది. జూలైలో 23.87 లక్షల ఖాతాలను నిషేధించగా, జూన్‌లో ఈ సంఖ్య 22 లక్షలు, మేలో 19 లక్షలుగా ఉంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.