Aadhaar-PAN Download : వాట్సాప్‌లోనే మీ ఆధార్, పాన్ కార్డు ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు తెలుసా?

Aadhaar-PAN Download : ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) కొన్ని ఏళ్ల క్రితం DigiLocker అనే భారతీయ ఆన్‌లైన్ డిజిటలైజేషన్ సర్వీసును ప్రారంభించింది.

Aadhaar-PAN Download : వాట్సాప్‌లోనే మీ ఆధార్, పాన్ కార్డు ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు తెలుసా?

How to download Aadhaar, PAN card on your phone using WhatsApp

Aadhaar-PAN Download : ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Meity) కొన్ని ఏళ్ల క్రితం DigiLocker అనే భారతీయ ఆన్‌లైన్ డిజిటలైజేషన్ సర్వీసును ప్రారంభించింది. DigiLocker ఒరిజినల్ వినియోగదారుల నుంచి డిజిటల్ ఫార్మాట్‌లో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, అకడమిక్ మార్క్‌షీట్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు/సర్టిఫికేట్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

ఆధార్ హోల్డర్‌ల కోసం ప్రత్యేకంగా డిజిలాకర్ వెబ్‌సైట్, యాప్ ఉన్నప్పటికీ.. సర్వీసులు వాట్సాప్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్లను డిజిలాకర్ నుంచి MyGov Helpdesk WhatsApp చాట్‌బాట్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

How to download Aadhaar, PAN card on your phone using WhatsApp

How to download Aadhaar, PAN card on your phone using WhatsApp

MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా మీరు కొన్ని సాధారణ దశల్లో మీ అధికారిక డాక్యుమెంట్లలో దేనినైనా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. అలాగే యాక్సెస్ చేయవచ్చు. డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, మార్క్‌షీట్‌లు మరిన్ని ఉన్నాయి. ఇప్పటికీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా DigiLocker సదుపాయాన్ని అందిస్తోంది.

WhatsApp చాట్‌బాట్ సర్వీసును పొందవచ్చు. ఆధార్ కార్డ్ నుంచి పాన్ కార్డు, మార్క్‌షీట్‌ల వరకు అన్నీ మీకు ఎప్పుడైనా WhatsAppలో అందుబాటులో ఉంటాయి. వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ నుంచి మీ డాక్యుమెంట్లను యాక్సెస్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నంచండి.

వాట్సాప్ ద్వారా ఆధార్, పాన్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? :

* +91-9013151515ని మీ ఫోన్‌లో MyGov హెల్ప్‌డెస్క్ కాంటాక్ట్ నంబర్‌గా Save చేయండి.
* WhatsApp ఓపెన్ చేసి.. మీ WhatsApp కాంటాక్టుల లిస్టును రిఫ్రెష్ చేయండి.
* MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి.
* MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌లో ‘Namaste’, ‘Hi’ అని టైప్ చేయండి.
* చాట్‌బాట్‌లో DigiLocker లేదా Cowin సర్వీస్ మధ్య ఎంచుకోవచ్చు. ‘DigiLocker Services’ ఎంచుకోండి.
* మీకు డిజిలాకర్ అకౌంట్ ఉందా అని చాట్‌బాట్ అడిగితే ‘Yes’ నొక్కండి.

How to download Aadhaar, PAN card on your phone using WhatsApp

How to download Aadhaar, PAN card on your phone using WhatsApp

* ఒకవేళ మీ వద్ద లేకుంటే అధికారిక వెబ్‌సైట్ లేదా డిజిలాకర్ యాప్‌ని విజిట్ చేసి మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
* చాట్‌బాట్ ఇప్పుడు మీ డిజిలాకర్ అకౌంట్ లింక్ చేసేందుకు మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
* మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకుంటారు. చాట్‌బాట్‌ని రిజిస్టర్ చేసుకోండి.
* చాట్‌బాట్ జాబితాలు మీ డిజిలాకర్ అకౌంటుతో లింక్ చేసిన అన్ని డాక్యుమెంట్లను చూడవచ్చు.
* డౌన్‌లోడ్ చేసేందుకు డాక్యుమెంట్ లిస్టు చేసిన నంబర్‌ను టైప్ చేసి పంపండి.
* మీ డాక్యమెంట్ PDF రూపంలో చాట్ బాక్స్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది.

మీరు ఒకేసారి ఒక డాక్యుమెంట్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు డిజిలాకర్ జారీ చేసిన డాక్యుమెంట్లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అవసరమైన డాక్యుమెంట్ జారీ కాకపోతే.. డిజిలాకర్ సైట్ లేదా యాప్‌లో పొందవచ్చు. జారీ చేసిన తర్వాత ఎప్పుడైనా WhatsApp చాట్‌బాట్ ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు.

Read Also : WhatsApp Call Links Feature : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై వీడియో కాల్స్ లింకులు కూడా పంపుకోవచ్చు..!