Tirupati private hotel
Both assassinated in Tirupati private hotel : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్ లో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోవటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. యువరాజు అనే వ్యక్తి తన భార్య, బావమరుదులను హత్య చేశాడు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి యువరాజు కుటుంబం వచ్చింది. తిరుపతిలోని ఓ హోటల్ లో బస చేశారు. హోటల్ రూమ్ లో ఉండగా వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విచక్షణ మర్చిపోయిన యువరాజ్ తన భార్య మనీషా,బావమరిది హర్షవర్ధన్ లను హత్య చేశాడు. భార్య, బామ్మర్ధిలను చంపిన యువరాజు అలిపిరి పీఎస్ లో లొంగిపోయాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవానికి వచ్చిన అన్నా చెల్లెళ్లు మనీషా, హర్షవర్ధన్ లో ఇద్దరు యువరాజు చేతిలో హత్యకు గురి కావటం కలకలం రేపుతోంది.
నిందితుడు యువరాజును అదుపులోకి తీసుకున్న అలిపిరి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో పరిస్థితి సమీక్షించారు. ఈ హత్యలకు కారణం ఏమిటీ..? గతంలో విభేధాలు ఉన్నాయా..? లేదా క్షణికావేశంలో జరిగిందా..?అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.