Missing Woman : 48 గంటల్లో నా భార్య ఆచూకీ తెలపకపోతే… మా శవాల లోకేషన్ షేర్ చేస్తాను

వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన  బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు   దొరిశెట్టి సత్యమూర్తి భార్య మూడు నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సత్యమూర్తి ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Missing Woman : 48 గంటల్లో నా భార్య ఆచూకీ తెలపకపోతే… మా శవాల లోకేషన్ షేర్ చేస్తాను

Vikarabad Wife Missing

Updated On : June 25, 2022 / 4:04 PM IST

Missing Woman :  వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన  బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు   దొరిశెట్టి సత్యమూర్తి భార్య మూడు నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సత్యమూర్తి ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

పోలీసులు వైఫల్యంతోనే తన భార్య ఆచూకీ లభించడం  లేదని ఆరోపించారు. తన భార్య అన్నపూర్ణ అదృశ్యమై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎక్కడుందో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తీవ్ర మనో వేదనకు గురై తన పిల్లలతో సహా ఆజ్ఞాతంలోకి వెళుతున్నట్లు ఆయన మీడియాలో పోస్ట్ పెట్టాడు.

48 గంటల్లో పోలీసులు తన భార్య ఆచూకీ కనిపెట్టి తెలుపక పోతే తమ శవాల లోకేషన్ షేర్ చేస్తానని సెల్ఫీ వీడియోలో హెచ్చరించాడు. సమాచారం  తెలుసుకున్న పోలీసులు ముందు సత్యమూర్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Also Read : Agnipath Protest : సుబ్బారావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు