Agnipath Protest : సుబ్బారావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన ముద్దాయి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావే అని తేలింది.  2014 లో సుబ్బారావు సాయి డిపెన్స్ అకాడమీని ఏర్పాటు చేశాడు.

Agnipath Protest : సుబ్బారావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Avula Subba Rao

Agnipath Protest :  సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన ముద్దాయి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావే అని తేలింది.  2014 లో సుబ్బారావు సాయి డిపెన్స్ అకాడమీని ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుంటే అక్కడకు వెళ్లి ఆర్మీ అభ్యర్ధుల వివరాలు తీసుకునేవాడు.

అనంతరం తన కోచింగ్ సెంటర్ లో చేరమని కోరేవాడు.  కోచింగ్ సెంటర్  లో అడ్మిషన్ కోసం అభ్యర్ధుల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రూ.3 లక్షలకు సుబ్బారావు బాండు తీసుకునే వాడని తెలిసింది.   కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం పెట్టటం వలన సుబ్బారావుకు సుమారు 45 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది.  అందుకోసం విద్యార్ధుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పరీక్ష పెట్టించాలనుకున్నాడు.  ఆర్మీ పరీక్ష లేకపోవటంతో సుబ్బారువు దగ్గర కోచింగ్ తీసుకున్న అభ్యర్ధులు హకీంపేట సోల్జర్స్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు.

గ్రూప్ సభ్యులు అందరూ హైదరాబాద్ లోని   ఏఆర్ఓ ఆఫీసుకు ర్యాలీగా వెళదామనుకున్నారు. సికింద్రాబాద్ ఘటన జరగటానికి ఒకరోజు ముందు సుబ్బారావు హైదరాబాద్ చేరుకుని బోడుప్పల్ లో ఉన్నా డు. అక్కడ సికింద్రాబాద్   రైల్వే స్టేషన్ లో  నిరసనలపై మల్లారెడ్డి, శివకుమార్ లతో చర్చించాడు.

బసిరెడ్డితో ఫోన్ లోనే   మాట్లాడాడు సుబ్బారావు.   అగ్నిపథ్ కు వ్యతిరేకంగా బీహార్ తరహాలో విధ్వంసం చేయాలని వాట్సప్ గ్రూపులో   సుబ్బారావు  సభ్యులకు వివరించాడు.  పెట్రోల్ బాటిల్స్ ‌తో   సికింద్రాబాద్ స్టేషన్ లోకి వెళ్లాలని   ఆడియో మెసేజ్ లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read : Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..