42 ఏళ్ల ఆంటీతో 20 ఏళ్ల కుర్రాడి రాసలీలలు : ప్రియుడితో కలిసి అడ్డుగా వున్న భర్త హత్య

సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో కోల్పోయామనే అసంతృప్తి. జీవితంలో భగవంతుడు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో కావాలనే ఆరాటం. దాన్నిసాధించుకోవాలనే తపన. ఇతరులకు ఉన్నది..తన వద్ద లేదనే దిగులు. ఎక్కడా ఏ విషయానికి సంతృప్తి చెందని అసంతృప్త జీవితాలు. ఇంతకంటే బెటర్ లైఫ్ ఎంజాయ్ చేయాలనే దురాశ..వీటితోనే కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు.
తాత్కాలిక సుఖాల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కొందరైతే తాత్కాలిక సుఖాల కోసం వయస్సుతో నిమిత్తం లేకుండా అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ఈ క్రమంలో అన్నెం, పున్నెం ఎరుగని కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఇటీవల డెహ్రడూన్ లో జరిగింది.
ఉత్తరాఖండ్ లోని, డెహ్రాడూన్, వికాస్ నగర్ లోని, జుడ్లి అడువాలా అనే గ్రామంలో రోహిత్ (పేరు మార్చాము) భార్యా , ఇద్దరు పిల్లలతో కలిసి కాపురం ఉంటున్నాడు. రోహిత్ భార్య పద్మకి (42) ( పేరు మార్చబడింది) అదే ఊళ్లో ఉంటున్న 20 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాలక్రమంలో వారిద్దరి మధ్య శారీరీక సంబంధానికి దారి తీసింది.
Also Read : భర్త ఆత్మహత్య….ఒంటరి తనంతో బావతో అక్రమ సంబంధం…
అప్పుడప్పుడు ఆ యువకుడు రోహిత్ ఇంటికి వచ్చివెళుతూ ఉండేవాడు. ఆమె కంటే 22 ఏళ్ళ చిన్నవాడు కావటంతో ఎవరికీ వీరిపై అనుమానం కలగలేదు. ఈ అవకాశాన్ని వారిద్దరూ అనుకూలంగా మలుచుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పద్మ ఆ యువకుడిని ఇంటికి పిలుచుకుని అతడితో రాసలీలల్లో మునిగి తేలిపోయేది.
చాలా కాలం పాటు గుట్టుగా వారిద్దరూ శృంగారాన్ని అనుభవించారు. తప్పుడు పనులు ఎక్కువ కాలం దాగి ఉండవన్నట్లు… కొంత కాలానికి వీరి వ్యవహారం భర్త రోహిత్ కు తెలిసిపోయింది.
సక్రమంగా కాపురం చేసుకోమని, పద్ధతిగా నడుచుకోమని భార్య పద్మను రోహిత్ హెచ్చరించాడు. దీంతో తమ వ్యవహారానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని అనుకుంది. ఈవిషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. ఏప్రిల్ 4, శనివారం రాత్రి అందరూ ఇంట్లో నిద్రిస్తుండగా పద్మ ప్రియుడిని ఇంటికి పిలిచింది.
Also Read : సహజీవనం పేరుతో సుఖాలనుభవించాడు….పెళ్ళనే సరికి పరార్
అందరూ నిద్రలో ఉండగా ప్రియుడు పద్మ ఇంటిలోకి ప్రవేశించాడు. తనతో తెచ్చుకున్న తుపాకి తో రోహిత్ తలపై కాల్చి పారిపోయాడు. తెల్లవారి ఏమీ తెలియనట్లు నిద్రలేచి తన భర్తను ఎవరో కాల్చి చంపారని ఏడ్వటం మొదలెట్టింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి శవాన్నిపోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నేర పరిశోధనలో భాగంగా పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. రోహిత్ ను తలపై కాలుస్తున్నా పక్కగదిలోనే పడుకుని ఉన్న పద్మకు కనీసం మెలుకవ రాకపోవటం…ఆమెకు తెలియకపోవటంపై పోలీసులకు అనుమానం కలిగింది.
ఇదే అనుమానాన్ని రోహిత్ తండ్రి మెల్హార్ , ఇతర బంధువులు కూడా వ్యక్త పరిచారు. పోలీసులు పద్మను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడు సాయంతో నే భర్తను హత్యే చేసినట్లు నేరం ఒప్పుకుంది.
Also Read : అన్న భార్యతో తమ్ముడి రాసలీలలు…..ఉద్యోగం కోసం విదేశాలకు అన్న….
వెంటనే పోలీసులు నేరం చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పద్మ ప్రియుడు కుడా నేరాన్ని అంగీకరించాడని హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని నిందితుడు పారెయ్యటంతో దాన్ని వెతికే పనిలో పోలీసులు ఉన్నట్లు ఎస్పీ దేహత్ పర్మీందర్ దోవల్ చెప్పారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.