Love Marriage Attack
Love Affair : అమ్మాయి తల్లితండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరుఫు బంధువులు దాడి చేసిన ఘటన కొమరం భీమ్ జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని తిర్యాని లో రాము అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన సమత అనే యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ఇష్టపడి ఇటీవల పెద్దలనెదిరించి పెళ్లి చేసుకున్నారు. రాముపై కోపం పెంచుకున్న అమ్మాయి తరుఫు బంధువులు మంగళవారం రాము ఇంటి వద్దకు వచ్చి మాట్లాడాలి బయటకు రమ్మని పిలిచారు.
అతను బయటకు రాగానే అక్కడకు వచ్చిన బంధువులు మూకుమ్మడిగా రాముపై దాడిచేసి పిడిగుద్దులతో చితక బాదారు. దాడిలో రాముకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తల్లితండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నానని, తన భర్తపై తల్లి తండ్రులు దాడి చేయించారని రాము భార్య సమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.