Kukatpally Incident: భర్తను చంపి.. పూడ్చి పెట్టి.. కనిపించడం లేదంటూ భార్య డ్రామా.. హైదరాబాద్‌లో దారుణం..

కల్లు తాగి నిద్రపోగా ఇదే అదనుగా భావించిన కవిత కరెంట్ షాక్ పెట్టి సాయులును హత్య చేసింది.

Kukatpally Incident: భర్తను చంపేసింది. మృతదేహాన్ని పూడ్చి పెట్టింది. ఆ తర్వాత కనిపించడం లేదంటూ డ్రామా ఆడింది. కట్ చేస్తే.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను భార్యే కడతేర్చినట్లు తేలింది.

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఈ దారుణం జరిగింది. కరెంట్ షాక్ ఇచ్చి భర్తను భార్యే చంపేసింది. ఆపై నిర్మానుష్య ప్రాంతంలో అతడి మృతదేహాన్ని పూడ్చి పెట్టింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు సొంతూరుకి వెళ్లిపోయింది. భర్త కనిపించడం లేదంటూ మాయమాటలు చెప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారించారు. ఈ విచారణలో భార్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. అంతే, ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్ లో ఎంక్వైరీ చేశారు. దాంతో అసలు నిజం బయటపడింది.

మెదక్ జిల్లా పాత లింగాయపాలెంకు చెందిన సాయులు, కవితకు 20 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. భార్య, భర్తలిద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాయులు తన గ్రామంలోనే పని చేసుకుంటూ ఉన్నాడు. కవిత హైదరాబాద్ లో ఉంటోంది. సాయులు కవితను తరుచూ ఆమె ఇంటికి వెళ్లి వేధిస్తుండే వాడు. ఈ క్రమంలోనే ఇటీవల కోలపల్లిలో బంధువులు చనిపోవడంతో అక్కడికి వెళ్లిన కవిత సాయులును కలిసింది. ఇద్దరం కలిసి బతుకుదామని, తనతో పాటు హైదరాబాద్ రావాలని సాయులను తీసుకెళ్లింది.

Also Read: భార్య టార్చర్‌తో భర్త బలవన్మరణం..! మగవారిని రక్షించే చట్టాలుంటే ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదంటూ తీవ్ర ఆవేదన

హైదరాబాద్ వచ్చాక కేపీహెచ్ బీ కాలనీలోని మిత్రా హిల్స్ లో ఓ గుడిసెలో వీరు నివాసం ఉంటున్నారు. కవిత సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేశం కూడా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కవిత, సాయులు మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. భర్త వేధింపులు భరించలేకపోయిన కవిత భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో సాయులు ఇంట్లోనే కవిత, ఆమె సోదరి జ్యోతి, మల్లేశం మధ్య గొడవ జరిగింది.

ఆ తర్వాత సాయులు కల్లు తాగి నిద్రపోగా ఇదే అదనుగా భావించిన కవిత.. కరెంట్ షాక్ పెట్టి సాయులును హత్య చేసింది. తన సోదరి జ్యోతి, మరిది మల్లేశంతో కలిసి సాయులు డెడ్ బాడీని మాయం చేయాలని ప్లాన్ చేసింది కవిత. ఆ తర్వాత ఓ ఆటో మాట్లాడి జోగిపేట వైపు మృతదేహాన్ని తీసుకెళ్లారు. వీరి కదలికలపై అనుమానం వచ్చి ఆటో డ్రైవర్ గట్టిగా మాట్లాడటంతో మృతదేహాన్ని శనివారం ఉదయం 11 గంటల సమయంలో తిరిగి మిత్రా హిల్స్ కు తెచ్చారు. గుడిసెలోనే సాయంత్రం వరకు ఉంచారు. దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని పడేయటానికి మల్లేశం చుట్టుపక్కల రెక్కీ నిర్వహించాడు. మిత్రా హిల్స్ సమీపంలోనే నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టేశారు.

Also Read: కళ్లల్లో కారం చల్లి, కట్టేసి, పొడిచి చంపిన భార్య.. మాజీ డీజీపీ దారుణ హత్య కేసులో ఒళ్లుగగుర్పొడిచే విషయాలు

సాయులు మృతదేహాన్ని పూడ్చి పెట్టాక కవిత లింగాయపల్లెకు వెళ్లిపోయింది. సాయులు 50వేలు తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడంటూ కుటుంబసభ్యులకు చెప్పింది. అప్పటికే సాయులు ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబసభ్యులకు కవితపై అనుమానం వచ్చింది. మరోవైపు ఆటో డ్రైవర్ ఆదివారం మధ్యాహ్నం కేపీహెచ్ బీ పోలీసులకు జరిగిన విషయం అంతా చెప్పాడు.

దర్యాఫ్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆదివారం రాత్రి కవితను అదుపులోకి తీసుకున్నారు. దాంతో గ్రామస్తులకు సాయులు హత్య విషయం తెలిసింది. సోమవారం ఉదయం మిత్రా హిల్స్ లోని గుడిసెను పరిశీలించగా విద్యుత్ తీగలను తగలబెట్టినట్లుగా గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే హత్య జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కవిత, జ్యోతి, మల్లేశంను తీసుకొచ్చి డెడ్ బాడీ పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించారు.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here