Husband Takes Life: భార్య టార్చర్‌తో భర్త బలవన్మరణం..! మగవారిని రక్షించే చట్టాలుంటే ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదంటూ తీవ్ర ఆవేదన
ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ ఆడవారికే అనుకూలంగా ఉన్నాయని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Husband Takes Life: భార్య టార్చర్ భరించలేక మరో భర్త బలవన్మరణం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. మోహిత్ యాదవ్ ప్రాణాలు తీసుకున్నాడు. బలవన్మరణానికి ముందు అతడు వీడియో రికార్డ్ చేశాడు. అందులో తన భార్య పెట్టిన టార్చర్ గురించి అతడు చెప్పుకున్నాడు.
ఆస్తినంతా తన కుటుంబసభ్యుల పేరు మీదకు మార్చాలని తన భార్య వేధించేదని మోహిత్ వాపోయాడు. అలా చేయకుంటే వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించిందన్నాడు. ప్రస్తుతం ఉన్న చట్టాలన్నీ ఆడవారికే అనుకూలంగా ఉన్నాయని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. మగవారిని రక్షించేలా చట్టాలు ఉండి ఉంటే తాను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదని వీడియోలో చెప్పాడు. ఆ తర్వాత ప్రాణాలు తీసుకున్నాడు.
”ఈ వీడియో మీకు అందే సమయానికి నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. పురుషుల రక్షణ కోసం ఒక చట్టం ఉంటే, బహుశా నేను ఈ చర్య తీసుకోకపోవచ్చు. నా భార్య ప్రియా యాదవ్, ఆమె కుటుంబం మానసిక హింసను నేను భరించలేకపోయాను. అమ్మ, నాన్న, దయచేసి నన్ను క్షమించండి. నా మరణం తర్వాత కూడా నాకు న్యాయం జరగకపోతే, నా అస్థికలను మురికి కాలువలో కలపండి” అని వీడియోలో చెప్పాడు మోహిత్ యాదవ్.
Also Read: డిజిటల్ రేప్ అంటే ఏమిటి? మేదాంత ఆసుపత్రి ఐసీయూలో జరిగిన షాకింగ్ క్రైమ్ ఏంటి..
”నా భార్య ప్రియా యాదవ్ నా ఇంటిని, ఆస్తిని తన పేరు మీద రిజిస్టర్ చేయమని బెదిరించింది. మా అత్తగారు నా భార్యకు గర్భస్రావం చేయించింది. నా ఇల్లు, ఆస్తిని ఆమె పేరు మీద రిజిస్టర్ చేయకపోతే, నా కుటుంబాన్ని వరకట్న వేధింపుల కేసులో ఇరికిస్తానని నా భార్య నన్ను బెదిరించింది. ఆమె తండ్రి మనోజ్ యాదవ్ తప్పుడు ఫిర్యాదు చేశాడు. నా భార్య సోదరుడు నన్ను చంపేస్తానని బెదిరించాడు” అంటూ చనిపోవడానికి ముందు ఓ వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్నాడు మోహిత్ యాదవ్.
2020 డిసెంబర్‌లో సంభాల్‌కు చెందిన ప్రియాంకను మోహిత్ వివాహం చేసుకున్నాడని, కొన్ని రోజులకే సమస్యలు ప్రారంభమయ్యాయని మృతుడి సోదరుడు తెలిపాడు. పెళ్లి సమయంలో కానుకగా ఇచ్చిన బంగారు ఆభరణాలతో మోహిత్ భార్య పారిపోయిందన్నాడు. పైగా మోహిత్ పైన, అతడి కుటుంబంపైన తప్పుడు ఫిర్యాదులు చేసిందన్నాడు.
గత సంవత్సరం డిసెంబర్‌లో 34 ఏళ్ల బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన మరణానికి ముందు, అతను 24 పేజీల నోట్, వీడియో సందేశాన్ని వదిలి వెళ్ళాడు. అందులో అతను తన భార్య, అత్తమామల వేధింపుల గురించి ప్రస్తావించాడు. వారు తనపై తప్పుడు కేసులు పెట్టారని, విడాకుల కోసం 3 కోట్లు డిమాండ్ చేశారని, తన కొడుకుతో మాట్లాడేందుకు అదనంగా 30 లక్షలు డిమాండ్ చేశారని అతను ఆరోపించాడు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here