Medanta Hospital ICU: డిజిటల్ రేప్ అంటే ఏమిటి? మేదాంత ఆసుపత్రి ఐసీయూలో జరిగిన షాకింగ్ క్రైమ్ ఏంటి..
ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, మానవ హక్కుల సంఘాలు డిజిటల్ లైంగిక దాడిని.. శారీరక సమగ్రత, వ్యక్తిగత గౌరవానికి తీవ్రమైన ఉల్లంఘనగా గుర్తిస్తున్నాయి.

Medanta Hospital ICU: గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రి ఐసీయూలో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆసుపత్రికి చెందిన సిబ్బంది ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు అదే ఆసుపత్రిలో 5 నెలలుగా టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు.
ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్ పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడి చేశాడు. గురుగ్రామ్ లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ లో ఎయిర్ హోస్టెస్ జారి పడింది. వెంటనే ఆమెను మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెపై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక బాధితురాలు దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడికి పాల్పడినందుకు మేదాంత ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక టెక్నీషియన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ICU గదిలో ఇద్దరు నర్సులు ఉండగా నిందితుడు లైంగిక దాడి చేశాడు. కళ్ల ముందే దారుణం జరుగుతున్నా ఆ నర్సులు పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా, ఈ తరహా నేరాన్ని లీగల్ భాషలో ‘డిజిటల్ రేప్’ అని అంటారు.
Also Read: బీర్ సీసాతో 36సార్లు పొడిచి భర్తను చంపిన భార్య, ఆ తర్వాత ప్రియుడికి వీడియో కాల్ చేసి…
డిజిటల్ రేప్ అంటే..
డిజిటల్ అత్యాచారం కేసుగా నివేదించబడిన ఈ దాడి ఐసీయూ గదిలో జరిగింది. ఇద్దరు నర్సులు అక్కడే ఉన్నారు కానీ వారు జోక్యం చేసుకోలేదు. ‘డిజిటల్ రేప్’ అనే పదం చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను ఉపయోగించి ఒక వ్యక్తి ప్రైవేట్ భాగాలలోకి చొచ్చుకుపోవడాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో “డిజిటల్” అనే పదం సాంకేతికతను కాదు చేతి లేదా పాదం అంకెలను సూచిస్తుంది.
డిజిటల్ అనే పదం వినగానే కంప్యూటర్ లేదా ఆన్‌లైన్, టెక్నాలజీ సంబంధించినదిగా అనుకుంటాం. కానీ, డిజిటల్ రేప్‌కు కంప్యూటర్ లేదా ఆన్‌లైన్ వ్యవహారాలకూ ఎలాంటి సంబంధం లేదు. డిజిట్ నుంచి ‘డిజిటల్ రేప్’ అనే పదం పుట్టుకొచ్చింది. ఇంగ్లీష్‌లో డిజిట్ అంటే అంకె. అలాగే, చేతి వేలు, బొటన వేలు లేదా కాలి వేలు అనే అర్థం కూడా ఉంది. డిజిటల్ రేప్ అంటే చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను బలవంతంగా మహిళల (లేదా పురుషుల) ప్రైవేట్ భాగాల్లోకి చొప్పించి, లైంగిక హింసకు పాల్పడటం. శరీర భాగాలను (పురుషాంగం కాకుండా) లేక వస్తువులు, పరికరాలను మహిళల యోనిలోకి, మూత్ర మార్గం లేదా మల ద్వారంలోకి చొప్పించడం లేదా మహిళలతో బలవంతంగా ఆ పని చేయించడాన్ని రేప్ అంటారు. దీన్నే డిజిటల్ రేప్‌గా వ్యవహరిస్తున్నారు.
డిజిటల్ అత్యాచారం అంటే.. బాహ్య సంబంధంతో కూడిన లైంగిక వేధింపుల రూపాల మాదిరిగా ఉండదు. సాధారణంగా చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను ఉపయోగించి చేసే లైంగిక హింస. ఇటువంటి దాడులు ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాలు లేదా పోలీసు కస్టడీలో కూడా అనేక రకాల వాతావరణాలలో జరగవచ్చు. డిజిటల్ అత్యాచారం ఫలితంగా వచ్చే గాయం తరచుగా శారీరక హాని, దీర్ఘకాలిక భావోద్వేగ, మానసిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
ఇప్పటికీ తరచుగా తక్కువగా నివేదించబడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు, మానవ హక్కుల సంఘాలు డిజిటల్ అత్యాచారాన్ని శారీరక సమగ్రత, వ్యక్తిగత గౌరవానికి తీవ్రమైన ఉల్లంఘనగా గుర్తిస్తున్నాయి. 2021లో జరిగిన కేసులో రెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు ఢిల్లీ కోర్టు ఒక వ్యక్తికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.
మేదాంత కేసులో నిందితుడిని బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల దీపక్‌గా గుర్తించారు. అతను గురుగ్రామ్‌లో నివసిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం నుండి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. ఐదు నెలల క్రితం మేదాంత ఆసుపత్రిలో టెక్నీషియన్ గా చేరాడు.
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 8 బృందాలు 4 రోజుల పాటు వేట సాగించాయి. 800 సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించాయి. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశాయి. తనపై లైంగిక దాడి జరిగినట్లు ఏప్రిల్ 14న 46ఏళ్ల ఎయిర్ హోస్టెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here