Husband Stabbed To Death: బీర్ సీసాతో 36సార్లు పొడిచి భర్తను చంపిన భార్య, ఆ తర్వాత ప్రియుడికి వీడియో కాల్ చేసి…
షాపింగ్ పేరుతో రాహుల్ ను అతడి భార్య బయటకు తీసుకెళ్లింది. వారిద్దరిని యువరాజ్ ఇద్దరు స్నేహితులు ఫాలో అయ్యారు.

Husband Stabbed To Death: ప్రియుడి మోజులో వివాహిత దారుణానికి ఒడిగట్టింది. అత్యంత పైశాచికంగా వ్యవహరించింది. తాళి కట్టిన భర్తనే కడతేర్చింది. బీర్ సీసాతో 36 సార్లు పొడిచి మరీ భర్తను హతమార్చింది. ఆపై తన ప్రియుడికి వీడియో కాల్ చేసి భర్త మృతదేహాన్ని అతడికి చూపించింది. పనైపోయింది అని అతడితో చెప్పి పైశాచిక ఆనందం పొందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హన్ పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. నేరానికి పాల్పడిన యువతి మైనర్ అని పోలీసుల విచారణలో తేలింది. భర్తను హత్య చేసిన తర్వాత ఆమె పారిపోయింది. ఆ యువతి తన ప్రియుడి ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. నిందితుల్లో ఒకరు మైనర్.
ఏప్రిల్ 13న పొదల్లో మృతదేహం ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. ఇండోర్ ఇచ్చాపూర్ రోడ్డులో ఐటీఐ కాలేజీకి ఎదురుగా ఉన్న పొదల్లో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేశాం. మృతుడిని షాపూర్ కి చెందిన రాహుల్ గా(25) గుర్తించాం. శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నాయి. ఘటన తర్వాత రాహుల్ భార్య పరారీలో ఉన్నట్లు విచారణలో తెలిసింది.
యువరాజ్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తెలిసింది. వెంటనే యువరాజ్ ను అదుపులోకి తీసుకున్నాం. మా స్టైల్ లో విచారించాం. తన ప్రియురాలితో కలిసి రాహుల్ ను చంపేందుకు ప్లాన్ చేసినట్లు అతడు చెప్పాడు. ఏప్రిల్ 12న రాత్రి 8 గంటల నుంచి 8.30 గంటల మధ్య తన ప్రియుడు యువరాజ్ కి రాహుల్ భార్య వీడియో కాల్ చేసింది. రక్తపు మడుగులో పడి ఉన్న రాహుల్ మృతదేహాన్ని యువరాజ్ కి చూపించింది. అంతేకాదు పనైపోయిందని చెప్పింది.
Also Read : MMTS లో అత్యాచారయత్నం ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్..
రాహుల్ ను హత్య చేసేందుకు ఆమెకు యువరాజ్ స్నేహితులు ఇద్దరు సహకరించారు. రాహుల్ ను హత్య చేశాక ముగ్గురూ పారిపోయారు. పరారీలో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశాం. పక్కా స్కెచ్ ప్రకారం రాహుల్ ను చంపేశారు. షాపింగ్ పేరుతో రాహుల్ ను అతడి భార్య బయటకు తీసుకెళ్లింది. వారిద్దరిని యువరాజ్ ఇద్దరు స్నేహితులు ఫాలో అయ్యారు.
బైక్ పై వెళ్తున్న సమయంలో స్పీడ్ బ్రేకర్ రాగా.. యువతి కావాలనే తన చెప్పును రోడ్డుపై వదిలేసింది. నా చెప్పు పడిపోయింది బైక్ ని ఆపు అని రాహుల్ తో చెప్పింది. దాంతో రాహుల్ బైక్ ను ఆపేశాడు. ఇంతలో వెనక నుంచి బైక్ వచ్చిన యువరాజ్ స్నేహితులు.. రాహుల్ ను పొదల్లోకి ఈడ్చుకెళ్లారు. అతడిపై దాడి చేశారు. ఇంతలో బీర్ సీసాతో యువతి తన భర్తపై దాడి చేసింది. దాంతో అతడు స్పృహ కోల్పోయాడు.
యువరాజ్ ఇద్దరు స్నేహితులు పదునైనా ఆయుధంతో పలుమార్లు రాహుల్ ను పొడిచారు. అతడి ప్రాణం పోయేవరకు పొడుస్తూనే ఉన్నారు. రాహుల్ చనిపోయాడని నిర్ధారణ చేసుకున్నాక ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం రైలు ఎక్కి ఉజ్జయినికి వెళ్లారు. ఈ నేరం చేసే సమయంలో నలుగురూ ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నారు” అని బుర్హన్ పూర్ జిల్లా ఎస్పీ దేవెంద్ర పటిదార్ తెలిపారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here