MMTS Incident: MMTS లో అత్యాచారయత్నం ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్..
పోలీసులను యువతి తప్పుదోవ పట్టించడంతో దాదాపు 100 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు.

Hyderabad MMTS trains
MMTS Incident: ఎంఎంటీఎస్ లో అత్యాచారయత్నం ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలిపై ఎలాంటి అత్యాచారయత్నం జరగలేదని పోలీసులు నిర్ధారించారు. మార్చి 22న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారయత్నం ఒక కట్టుకథ అని తేల్చారు. ఇన్ స్టా రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు యువతి రైలు నుంచి జారి పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆ విషయం బయటకు తెలిస్తే అంతా తనను తిడతారని భయపడ్డ యువతి.. కప్పిపుచ్చుకునేందుకు అత్యాచారం అంటూ డ్రామా ఆడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులను యువతి తప్పుదోవ పట్టించడంతో దాదాపు 100 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. 250 సీసీ కెమెరాల ఫుటేజ్ లను జల్లెడ పట్టగా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం ఏర్పడింది. చివరికి విచారణలో అసలు నిజం ఒప్పుకుంది. లీగన్ ఒపీనియన్ తీసుకుని కేసుని క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు.
తనపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచార యత్నం చేయగా.. తాను అతడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైలు నుంచి దూకేసినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఎంఎంటీఎస్ లో యువతిపై లైంగిక దాడి యత్నం ఘటన సంచలనం రేపడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. ముమ్మరంగా దర్యాఫ్తు చేశారు. చివరికి అసలు నిజం తెలిసి పోలీసుల ఫ్యూజులే ఎగిరాయ్. అసలు యువతిపై అత్యాచారయత్నమే జరగలేదని పోలీసుల విచారణలో తేలింది.
Also Read : అయ్యో.. రామచిలుక ఎంత పనిచేసింది..! పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ..
రైల్లో వెళ్తూ ఇన్ స్టా రీల్స్ చేసిన ఆమె.. ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం చెబితే అంతా తనను తిడతారని భయపడిన యువతి కట్టు కథ అల్లింది. ఓ యువకుడు అత్యాచారం చేయబోగా రైలు నుంచి దూకేసినట్లు స్టోరీ చెప్పింది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరిపిన పోలీసులు.. యువతిని తమదైన స్టైల్ లో విచారించగా.. అసలు నిజం బయటపడింది.
మార్చి 22న ఓ యువతి ఎంఎంటీఎస్ రైలు నుంచి పడిపోయి తీవ్ర గాయాలపాలైంది. ఆ యువతి నుంచి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఓ యువకుడు తనపై అత్యాచారయత్నం చేయబోయాడని, తప్పించుకునే క్రమంలో రైలు నుంచి దూకేసినట్లు ఆ యువతి పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ ఘటన సంచలనం రేపింది. రాజకీయ రంగు కూడా పులుముకుంది. విపక్షాలు అధికార పక్షాన్ని టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించాయి.
Also Read : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం.. త్వరలో ప్రకటన..?
దాంతో పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని దర్యాఫ్తు చేశారు. దాదాపు నెల రోజులు విచారణ చేశారు. దాదాపుగా 250 సీసీ కెమెరాలను జల్లెట పట్టారు. 100 మంది అనుమానితులను విచారించారు. అయితే, యువతి చెప్పిన పోలికలు ఏ వ్యక్తికి మ్యాచ్ కాలేదు. దాంతో యువతి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ లు కలెక్ట్ చేశారు. హెల్త్ రిపోర్టులో కూడా ఆమెపై లైంగిక దాడి యత్నం జరగలేదని బయటపడింది. దాంతో తమదైన స్టైల్ లో యువతిని ఎంక్వైరీ చేయగా.. అసలు ఆమెపై అత్యాచారయత్నమే జరగలేదని తేలింది. యువతి కట్టు కథ అల్లిందని గుర్తించారు. రైలు మెట్లపై ఇన్ స్టా రీల్స్ చేస్తూ కింద పడిపోయినట్లు యువతి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here