Ex DGP Om Prakash: కళ్లల్లో కారం చల్లి, కట్టేసి, పొడిచి చంపిన భార్య.. మాజీ డీజీపీ దారుణ హత్య కేసులో ఒళ్లుగగుర్పొడిచే విషయాలు
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.

Ex DGP Om Prakash: కర్నాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య సంచలనంగా మారింది. సొంత భార్యనే ఆయనను అత్యంత కిరాతకంగా చంపేసింది. ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య భర్తల మధ్య ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఆ గొడవలే ఈ దారుణానికి దారితీశాయని పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాశ్, ఆయన భార్య పల్లవికి మధ్య గొడవ జరిగింది. మాట మాట పెరిగింది. గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన పల్లవి దారుణానికి ఒడిగట్టింది. భర్తపై కారం పొడి చల్లింది. తాళ్లతో కట్టేసింది. ఆ తర్వాత గ్లాస్ బాటిల్ తో పలుమార్లు పొడిచి భర్త ఓం ప్రకాశ్ ను భార్య పల్లవి చంపింది. భర్తను చంపాక ఆమె ఒక ఐపీఎస్ అధికారి భార్యకు ఫోన్ చేసింది. రాక్షసుడిని చంపేశానని ఆమెతో చెప్పింది.
ఇటీవల ఆయన తనకు చెందిన ఒక ఆస్తిని తన బంధువుకు బదిలీ చేశారు. అది భార్యకు నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. చివరికి ఈ దారుణానికి దారితీసింది. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. తన తల్లి పల్లవి 12 ఏళ్లుగా స్కిజోఫీనియాతో బాధపడుతోందని, చికిత్స కూడా పొందుతోందని ఆమె కుమారుడు తెలిపాడు. తనకు తన భర్త నుంచి ప్రమాదం ఉందని తరచూ ఆమె భయపడేదని, ఊహాజనితమైన ఆలోచనలతో ఆందోళనకు గురయ్యేదని అతడు పోలీసులతో చెప్పాడు.
ఓం ప్రకాశ్ వయసు 68 ఏళ్లు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. బీహార్‌లోని చంపారన్‌కు చెందిన ఓం ప్రకాశ్.. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2017లో రిటైర్ అయ్యారు. రిటైర్ మెంట్ తర్వాత బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ లో నివాసం ఉంటున్నారు. భార్య చేతిలోనే మాజీ డీజీపీ దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here