Om Prakash: ఇంట్లోనే మాజీ డీజీపీ దారుణ హత్య.. శరీరంపై కత్తిపోట్లు.. భార్యపైనే పోలీసుల అనుమానాలు.. అసలేం జరిగింది..

ఆయన రక్తపు మడుగులో కనిపించారని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.

Om Prakash: ఇంట్లోనే మాజీ డీజీపీ దారుణ హత్య.. శరీరంపై కత్తిపోట్లు.. భార్యపైనే పోలీసుల అనుమానాలు.. అసలేం జరిగింది..

Updated On : April 21, 2025 / 12:04 AM IST

Om Prakash: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు గుర్తించారు. కాగా, ఓం ప్రకాశ్ ను ఆయన భార్యే చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2017 వరకు కర్ణాటక డీజీపీగా ఓం ప్రకాశ్ పనిచేశారు.

ఆదివారం సాయంత్రం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ లోని తన ఇంట్లో ఓం ప్రకాశ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ప్రధాన అనుమానితురాలు ఓం ప్రకాష్ భార్య ఉన్నారు.

పోలీస్ కమిషనర్ బి దయానంద.. ప్రకాశ్ మరణాన్ని ధృవీకరించారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆయన రక్తపు మడుగులో కనిపించారని అన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ప్రకాశ్ ను అతని భార్యే చంపిందని అనుమానం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తలు తరుచూ గొడవ పడేవారని సమాచారం.

తామింకా సాక్షులతో మాట్లాడలేదని, వివరాలు తెలుసుకున్న తర్వాత, ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియజేస్తామని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. కాగా, తన భర్త ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని, తనను చంపాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని ప్రకాష్ భార్య వాట్సాప్ సందేశాన్ని పంచుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: డిజిటల్ రేప్ అంటే ఏమిటి? మేదాంత ఆసుపత్రి ఐసీయూలో జరిగిన షాకింగ్ క్రైమ్ ఏంటి..

సంఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ అధికారులు ప్రకాశ్ భార్యను ప్రశ్నించారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రకాష్ 2015 నుండి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేసే వరకు కర్ణాటక రాష్ట్ర డిజిపి, ఐజిపిగా పనిచేశారు.

Also Read: భార్య టార్చర్‌తో భర్త బలవన్మరణం..! మగవారిని రక్షించే చట్టాలుంటే ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదంటూ తీవ్ర ఆవేదన

బీహార్‌కు చెందిన ప్రకాష్ అప్పటి బళ్లారి జిల్లా హరపనహళ్లిలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. తర్వాత ఎస్పీ శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్కమగళూరుతో సహా వివిధ ప్రదేశాలలో పనిచేశారు. లోకాయుక్త, అగ్నిమాపక, అత్యవసర సేవలు, నేర పరిశోధన విభాగం (CID)లో DIGగా కూడా పని చేశారు. మార్చి 2015లో రాష్ట్ర పోలీస్ చీఫ్‌గా నియమితులైన ఆయన 2017లో పదవీ విరమణ చేశారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here