Nellore Crime: మాజీ ప్రియుడిని కారుతో ఢీకొట్టి హతమార్చబోయిన యువతి

ఆత్మకూరులో ఓ యువతీ తన మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించి కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Nellore Crime: మాజీ ప్రియుడిని కారుతో ఢీకొట్టి హతమార్చబోయిన యువతి

Nellore

Updated On : March 22, 2022 / 3:15 PM IST

Nellore Crime: నెల్లూరు జిల్లాలో వరుస దారుణ ఘటనలు కలవరపెడుతున్నాయి. జిల్లాలోని వెంకటగిరిలో చెంచు కృష్ణ అనే ప్రేమోన్మాది ఇటీవల మైనర్ బాలికపై దాడి చేసి అతి దారుణంగా ఆమె గొంతుకోశాడు. ఈఘటనలో బాలిక చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇక ఈఘటన మరువకముందే..నెల్లూరు జిల్లాలో మంగళవారం మరో ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరులో ఓ యువతీ తన మాజీ ప్రియుడిని ఇంటికి పిలిపించి కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నజీర్ అనే యువకుడు అక్కడే స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న ఆసిఫా కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు.

Also read:Delhi Crime : పసిబిడ్డను మైక్రోఓవెన్‌లో పెట్టి చంపిన తల్లి..!!

అయితే ఇటీవల అసిఫాకు అబ్దుల్ రెహమాన్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఈక్రమంలో నజీర్ సెల్ ఫోన్లో ఉన్న తన ఫోటోలను, చాటింగ్ లను డిలీట్ చేయించాలని భావించిన అసిఫా అతణ్ణి ఇంటికి పిలిపించింది. అనంతరం తనకు కాబోయే భర్త అబ్దుల్ రెహమాన్ తో కలిసి అసిఫా నజీర్ ను కారుతో ఢీకొట్టించి హతమార్చేందుకు ప్రయత్నించింది. ఈఘటనలో తీవ్ర గాయాలతో బయటపడ్డ నజీర్ ను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి అసిఫాను, అబ్దుల్ రెహమాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:Noida Run: ఆ యువకుడికి నేను సాయం చేస్తా.. – రిటైర్డ్ జనరల్