Perni Nani: టీడీపీ.. స్పీకర్‌తో ఆకతాయితనంగా ప్రవర్తిస్తోంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని టీడీపీపై అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గౌరవ హోదాలో ఉన్న స్పీకర్‌పైన..

Perni Nani: టీడీపీ.. స్పీకర్‌తో ఆకతాయితనంగా ప్రవర్తిస్తోంది

Perni Nani

Updated On : March 22, 2022 / 1:43 PM IST

Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నాని టీడీపీపై అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గౌరవ హోదాలో ఉన్న స్పీకర్‌పైన ఆకతాయితనంగా ప్రవర్తించడమేంటని ప్రశ్నించారు.

‘టీడీపీ వాళ్ళు శాసన సభ్యులా? ఇక్కడికి వచ్చి ఏమి చేద్దాం అనుకుంటున్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం టీడీపీ నేతలకే చెల్లుతుంది’

‘కొత్తపల్లి సుబ్బారాయుడు.. వైసీపీ ఎమ్యెల్యే ప్రసాదరాజును గెలిపించి తప్పు చేశామని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడం ఇష్టం లేకపోతే సీఎంతో తన అభిప్రాయాలు చెప్పొచ్చు.

Read Also : సినిమా టికెట్ రేట్లపై మీడియాతో పేర్ని నాని సమావేశం.. ‘ఆర్ఆర్ఆర్’కి టికెట్ పెంపు??

‘నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ను రాజకీయంగా కించపరచడం, బురద జల్లడం కరెక్ట్ కాదు. సుబ్బారాయుడితో సజ్జల, సుబ్బారెడ్డి లు సుబ్బారాయుడు తో ఇదే విషయంపై మాట్లాడుతున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.