×
Ad

Honey Trapping : హానీ‌ట్రాప్‌లో ఆర్ఎస్ఎస్ నాయకుడు, బంగారం వ్యాపారి-మహిళ అరెస్ట్

కర్ణాటకకు చెందిన బంగారం వ్యాపారి అయిన ఆర్ఎస్ఎస్ నాయకుడిని హానీట్రాప్ చేసి రూ.46 లక్షలు కాజేసిన కేసులో పోలీసులు సామాజిక, మానవ హక్కుల కార్యకర్త సల్మాబానును సోమవారం అరెస్ట్ చేశారు.

  • Published On : August 23, 2022 / 01:44 PM IST

karnataka honey trap

Honey Trapping : కర్ణాటకకు చెందిన బంగారం వ్యాపారి అయిన ఆర్ఎస్ఎస్ నాయకుడిని హానీట్రాప్ చేసి రూ.46 లక్షలు కాజేసిన కేసులో పోలీసులు సామాజిక, మానవ హక్కుల కార్యకర్త సల్మాబానును సోమవారం అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని మాండ్యలో నివసించే ఆర్ఎస్ఎస్ నాయకుడు, శ్రీనిధి నగల షాపు యజమాని ఎస్‌.జగన్నాథ్‌ శెట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో మంగుళూరు వెళ్లాలని మాంండ్య బస్టాండ్ వద్దకు వచ్చారు.

ఆ సమయంలో ఆయన ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోని వారు ఆయన్ను ఎక్కడకు వెళుతున్నారని అడిగారు. మేము మైసూర్ దాకా డ్రాప్ చేస్తామని చెప్పి లిఫ్టు ఇచ్చారు. సరే కదా అని వారి కారు ఎక్కాడు జగన్నాథ్ శెట్టి.  కారులో వచ్చిన వారిని సామాజిక, హక్కుల కార్యకర్త సల్మాబాను, మరో వ్యక్తి జయంత్ గా పరిచయం చేసుకున్నారు. వీరిద్దరూ కాక మరో ఇద్దరు కారులో ఉన్నారు.

మార్గ మధ్యలో మా వద్ద బంగారం బిస్కెట్లు ఉన్నాయని వాటి విలువ చెప్పాలని వారిద్దరూ ఆయన్ను కోరారు. తనకు అంత సమయంలేదని   చెపుతున్నా వినకుండా ఆయన్ను మైసూరులోని ఒక హోటల్ కు తీసుకువెళ్లారు.  అక్కడ  గదిలోకి మరోక యువతి కూడా వచ్చింది.  బంగారం బిస్కెట్లు చూపించే నెపంతో ఆ మహిళలు   ఇద్దరూ జగన్నాధ్ శెట్టితో సన్నిహితంగా మెలిగారు.  అతనికి   తెలియకుండా జయంత్ ఇదంతా వీడియో తీశాడు.

అనంతరం ఆ వీడియో   చూపించి శెట్టిని నాలుగు కోట్ల  రూపాయలు  ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. నిడ్డోడి జగన్నాధ శెట్టి దక్షిణ కన్నడ జిల్లాల్లో బలమైన రాజకీయ నాయకుడుగా ఉన్నారు. తన పరువు పోతుందనే భయంతో…. దిక్కుతోచని శెట్టి తనకు తెలిసిన ఎల్ఐసీ ఉద్యోగి నుంచి, మరోక జ్యూయలరీ షాపు యజమాని నుంచి రూ. 46 లక్షల రూపాయలు వారికి ట్రాన్సఫర్ చేసి అక్కడి నుంచి బయట పడ్డాడు.

ఇటీవల   నిందితులు బాధితుడిని మిగిలిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయటం మొదలు పెట్టారు. వారి వేధింపులు భరించలేని జగన్నాధ్ శెట్టి   పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు సల్మాబానును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Also Read : Extra Marital Affair : ప్రియుడిపై మోజుతో భర్తపై ఆరుసార్లు హత్యాయత్నం.. చివరికి సక్సెస్