Woman Advocate Attacked: మహిళా న్యాయవాదిపై కొడవలితో దాడి.. అడ్డుకున్న కూతురుకూ గాయాలు

మహిళా న్యాయవాదిపై ఒక దుండగుడు కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కూతురుపైనా దాడి చేశాడు. అడ్వకేట్స్ ఆఫీసులోనే, గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో జరిగింది.

Woman Advocate Attacked: తమిళనాడులో దారుణం జరిగింది. కోర్టు కార్యాలయం పరిధిలోనే మహిళా న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడు, తిరుప్పూర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది.

Beer Bottles Video: బుల్డోజర్‌తో లక్ష బీర్ బాటిళ్లు ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ.. ఎందుకో తెలుసా!

జమీలా బాను అనే మహిళా న్యాయవాది స్థానిక కుమరన్ సాలైలోని మనీలా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తోంది. కాగా, తన రీసెర్చ్ కోసం పాత కేసులకు సంబంధించిన నోట్స్ తీసుకునేందుకు కూతురుతో కలిసి అడ్వకేట్స్ ఆఫీసుకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఉన్నట్టుండి ఆఫీసులోకి చొరబడి జమీలా బానుపై కొడవలితో దాడి చేశాడు. వెంటనే అక్కడే ఉన్న ఆమె కూతురు, ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనలో జమీలాతోపాటు, ఆమె కూతురుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. జమీలా శరీరం రక్తంతో నిండిపోయింది. జమీలా ఏడుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు వెంటనే అక్కడికి చేరుకుని, ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు.

Indian Air Force: యుద్ధ విమానాలతో ఒళ్లు జలధరించేలా భారత వాయుసేన విన్యాసాలు.. ఆకట్టుకుంటున్న వీడియో

ఈ క్రమంలో నిందితుడు ఆ కొడవలిని అక్కడే పడేసి, పారిపోయాడు. జమీలా చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు జమీలాను, ఆమె కూతురును చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

 

ట్రెండింగ్ వార్తలు