Bangalore : భర్త అనారోగ్యంతో మృతి..ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తామామల డిమాండ్..చివరకు
ఆ డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో..తీవ్ర ఆగ్రహానికి గురైన అత్తామామలు..ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు...

Crime
Bangalore : అనారోగ్యంతో భర్త చనిపోయాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి అత్తవారింట్లో కాకుండా..వేరేగా ఉంటోంది. భర్తకు సంబంధించిన బీమా డబ్బులు ఆమె అకౌంట్లో జమ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అత్తామామలు..ఆ డబ్బులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో..తీవ్ర ఆగ్రహానికి గురైన అత్తామామలు..ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలైన ఆమె..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.
Read More : Omicron Effect on Films: టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో?!
శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హోళెనల్కెర గ్రామంలో రిహానా బానుకు ఏడేళ్ల క్రితం ఇమ్రాన్ ఆలీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే..సంవత్సరం క్రితం అనారోగ్యంతో ఇమ్రాన్ చనిపోయాడు. దీంతో ఇద్దరు పిల్లలతో వేరుగా ఉంటోంది. ఇటీవలే భర్తకు చెందిన ఇన్సూరెన్స్ డబ్బులు రూ. 2లక్షలు ఆమె అకౌంట్లోకి వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న అత్త, మామలు ఆమె ఉంటున్న నివాసానికి వచ్చారు.
Read More : Komuravelli : కొమురవెల్లి మల్లన్న కళ్యాణం..వారికి మాత్రమే అనుమతి
డబ్బుల కోసం గొడవ పడ్డారు. తాను ఆ డబ్బు ఇవ్వనని రిహాన ఖరాఖండిగా చెప్పేసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అత్త, మామలు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలకు తాళలేక కేకలు వేసింది. స్థానికంగా ఉన్న వారు మంటలను ఆర్పి..పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రిహానాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.