Illegal Affair
Illegal Affair : తన కంటే వయస్సులో చిన్నవాడైన వ్యక్తితో ప్రేమలో పడిందో వివాహిత మహిళ. కొన్నాళ్లకు ఇద్దరూ కలిసి సహజీవనం చేయటం మొదలెట్టారు. ఈ క్రమంలో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
కర్ణాటకలోని ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపంలోని నరసీపురం గ్రామానికి చెందిన ప్రకాష్, లక్ష్మి(38) భార్యా భర్తలు. వీరిద్దరూ కర్ణాటకలోని బళ్లూరులో హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. తరచుగా వీరి హోటల్‌కు వచ్చే డెంకణీ కోట తాలూకా ఎలసట్టి గ్రామానికి చెందిన సెల్వరాజ్(28) అనే యువకుడితో లక్ష్మికి పరిచం ఏర్పడింది. ఆపరిచయం క్రమేపీ ప్రేమగా మారింది.
తన కంటే వయస్సులో 10 ఏళ్లు చిన్నావాడైన సెల్వరాజ్ తో ప్రేమలో పడింది. ఒకరోజు ప్రేయసి ప్రియులిద్దరూ అక్కడి నుంచి పారిపోయి హోసూరు సమీపంలోని బొమ్మండపల్లిలో కాపురం పెట్టారు. ఇద్దరూ కలిసి కాపురం పెట్టినప్పటి నుంచి సెల్వరాజ్ తరచూ లక్ష్మితో గొడవ పడసాగాడు. ప్రియుడి గొడవతో విరక్తి చెందిన లక్ష్మి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న మత్తిగిరి పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.