Kerala Court : ప్రియుడిపై మోజు .. కన్నకూతుళ్లపై లైంగిక వేధింపులకు సహకరించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష

ప్రియుడికి సహకరించిన తన ఇద్దరు ఆడపిల్లలపై వేధింపులకు సహకరించిన తల్లికి కోర్టు కఠిన శిక్ష విధించింది. తల్లివేనా..? అని ప్రశ్నించింది. మాతత్వానికే మాయని మచ్చ అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.

mother 40 Years Jailed

Kerala  special Fast Track Court : ఈ సృష్టిలో అమ్మకు చాలా గొప్పస్థానం ఉంది. కన్నబిడ్డలు నిద్రలో ఉలిక్కిపడ్డా కన్నతల్లి మనస్సు విలవిల్లాడిపోతుంది. బిడ్డను అక్కున చేర్చుకుని ధైర్యాన్నిస్తుంది.తన బిడ్డలపై ఎవరి కళ్లు పడకుండా కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. బిడ్డలకు చిన్నపాటి బాధకలిగితే దానికి కారణమైనవారిపై విరుచుకుపడుతుంది. ఇది కేవలం మనుషులకే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతీ పశు,పక్ష్యాదుల విషయంలో కూడా తల్లి అలాగే ప్రవర్తిస్తుంది. కానీ నేటి సమాజంలో అమ్మతనానికి మాయని మచ్చలా..కన్నబిడ్డల పాలిట మృత్యువులా మారుతున్న తల్లులు అమ్మతనికే కాదు సభ్య సమాజానికే మాయని మచ్చలా తయారవుతున్నారు. అటువంటి ఓ అమ్మ చేసిన పనికి ఇద్దరు చిన్నారులు చిత్రహింసలకు గురయ్యారు. ‘‘అమ్మా నన్ను..చెల్లిని అంకుల్ వేధిస్తున్నాడు..ఎక్కడెక్కడో చేతులు వేసి హింసిస్తున్నాడమ్మా’’ అని నోరు తెరిచి తమ బాధను చెప్పుకున్నా ఓ తల్లి పట్టించుకోలేదు. సరికదా..ప్రియుడి మోజులో పడి ఆ ప్రియుడు తన కన్న ఆడబిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడుతుంటే సహకరించింది.

అటువంటి కన్నతల్లి దారుణాలు..ఆమె ప్రియుడు ఆమె ఆడబిడ్డలపై చేసే పాశవిక హింసలు కోర్టు దృష్టికి రావటంతో ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ తల్లికి అత్యంత కఠిన శిక్ష విధిస్తు..40 ఏళ్లు జైలు శిక్షను విధిస్తు తీర్పునిచ్చింది కేరళ కోర్టు. పోక్సో చట్టం కింద నమోదు అయిన ఈ కేసులో సదరు తల్లికి 40 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా కట్టాలని సోమవారం (నవంబర్,2023)తీర్పునిస్తు.. ఆదేశాలు జారీ చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు.

Also Read : వేరు కాపురం కోసం వేధింపులు, అంగీకరించని భర్త చెవి కొరికేసిన మహిళ

తిరువనంతపురం పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆమె భర్త వదిలేసి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి వేరుగా నివసిస్తోంది. ఈక్రమంలో ఆమెకు శిశుపాలన్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఆమె ప్రియుడి ఇంటికి వెళ్లి వచ్చేది. పలుమార్లు తన ఇద్దరు కూతుళ్లను తీసుకెళ్లేది. దీంతో శిశుపాలన్ కన్ను ఆ ఇద్దరు ఆడపిల్లలపై పడింది. మాయమాటలు చెప్పి వారిలో చిన్నపాపను తన ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించేవాడు. దీంతో ఆ చిన్నారి భరించలేకపోయింది. అతని పైశాచిక చర్యలకు గాయాలయ్యాయి. ఆ తరువాత మరోసారి పెద్ద పాపను తన ఇంటికి పంపించాలని చెప్పగా ఆమె తీసుకెళ్లింది. అలా ఇద్దరు చిన్నారుల్ని తన ఇంటికి తీసుకురమ్మని ఆమెను అడిగేవాడు.

దానికి ఆమె అభ్యంతరం చెప్పకపోగా..ప్రియుడి మోజులో పడిన ఆమె తన ఇద్దరు కూతుళ్లను అతని ఇంటికి పంపించేది. కన్నతల్లే పంపిస్తుంటే ఇక ఆ కామాంధుడి ఆగడాలకు అడ్డేముంది..? బొమ్మలతో ఆడుకున్నట్లుగా ఆ ఇద్దరు చిన్నారుల శరీరాలతో ఆడుకున్నాడు. దీంతో అతని పైశాచిక చర్యలకు ఇద్దరి లేత శరీరాలు గాయాలయ్యాయి. 2018-19 మధ్య ఆ చిన్నారులు ఇద్దరు ఆ కామాంధుడి చేతిలో దారుణ హింసలకు గురయ్యారు. కన్నతల్లి ఎదురుగానే హింసించేవాడు. కానీ ఆమె ఏమీ అనేది కాదు.

Also Read :  Woman Killed : ఒడిశాలో దారుణం.. మహిళను హత్య చేసి, మృతదేహాన్ని 31 ముక్కలుగా నరికారు

దీంతో భరించలేక తల్లికి చెప్పుకున్నా ఫలితం లేకపోయేసరికి ఆ చిన్నారులు తప్పించుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఏడ్చుకుంటు జరిగింది చెప్పారు. ఆమె వారిని చిల్డ్రన్స్ హోమ్ కు తీసుకెళ్లి విషయం చెప్పింది. సహాయం చేయమని కోరింది. అక్కడివారు చిన్నారుల్ని ప్రశ్నించగా అమ్మమ్మకు చెప్పిందే వారికి కూడా చెప్పారు. దీంతో వారి సహాయంతో చిన్నారుల అమ్మమ్మ కేసు నమోదు చేయటం శిశుపాలన్ ను, పిల్లల తల్లిని అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుపరచటంతో కోర్టు విచారణ చేపట్టింది. కోర్టు వారికి రిమాండ్ విధించింది.

ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విచారణలో భాగంగా న్యాయమూర్తి ఆర్ రేఖ సదరు తల్లిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నువ్వసలు తల్లివేనా..? అని ప్రశ్నించారు. మాతత్వానికే అవమానకరమైన ఈ తల్లి క్షమాపణకు అర్హురాలు కాదంటు కఠిన శిక్షకు పాత్రురాలు అంటూ వ్యాఖ్యానించారు. ఈకేసులో నిందితుడు శిశుపాలన్ (ఆత్మహత్య)చనిపోవటంతో కన్నబిడ్డలపై లైంగిక వేధింపులకు సహకరించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 జరిమానా కూడా విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది. ఈకేసు విచారణలో 20మంది సాక్షులను విచారించారు. వారి సాక్ష్యాలను బట్టి ఈ తీర్పునిచ్చారు న్యాయమూర్తి రేఖ. బాధిత చిన్నారులు ప్రస్తుతం బాలల గృహంలో ఉంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు