Gurugram
Gurugram: పక్కింట్లో తనకంటే చిన్న వయస్సు కలిగిన వ్యక్తితో మహిళ అఫైర్ పెట్టుకుంది. కొన్నాళ్లుగా వీరిమధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఓ రోజు పక్కింటి వ్యక్తి ఫోన్‌ను ఆమె కుమార్తె పరిశీలించగా అందులో తన తల్లితో అతను సన్నిహితంగా ఉన్న ఫొటోలను గుర్తించింది. ఆ మరుసటిరోజే ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. దీంతో భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. గట్టిగా మందలించాడు. అయితే, భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి మహిళ ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం భర్తను చంపేసింది. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన గురుగ్రామ్ లో జరిగింది.
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. విక్రమ్ (37) దుండహెరా గ్రామానికి చెందిన వ్యక్తి. బీహార్ లోని నవాడాకు చెందిన సోని దేవి (35)తో అతనికి వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. వారు గురుగ్రామ్‌లో ఉంటున్నారు. వారింటికి పక్కనే రవీంద్ర (34) ఉంటున్నాడు. అయితే, సోని దేవి, రవీంద్రకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది.
ఓ రోజు సోనీ దేవి కుమార్తె రవీందర్ ఇంటికి వెళ్లింది. అతని ఫోన్‌ను పరిశీలించగా.. తన తల్లితో రవీంద్ర సన్నిహితంగా ఉన్న వీడియోను చూసింది. ఈ విషయాన్నితన తండ్రి విక్రమ్‌కు చెప్పడంతో అతను సోనీ దేవిని మందలించాడు. విషయం భర్తకు తెలియడంతో అతన్ని హత్య చేసేందుకు సోనీ దేవి ప్లాన్ చేసింది.
తన భర్తను హత్య చేయాలని ప్రియుడు రవీంద్రపై ఒత్తిడి తెచ్చింది. వారిద్దరూ యూట్యూబ్‌లో ఎలా హత్య చేయాలని పరిశీలించారు. జులై 26న రవీంద్ర తన స్నేహితులు మనీష్ (19), ఫరియాద్ (20)తో కలిసి విక్రమ్ హత్యకు ప్లాన్ చేశాడు. విక్రమ్ పనిపూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా అతన్ని కారులోకి బలవంతంగా లాక్కెళ్లి.. తాడుతో గొంతుకోసి చంపేశారు. ఆ తరువాత మొహ్మద్‌పూర్ ఝార్సా గ్రామం సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
జులై 28న సోనీ దేవి తన భర్త కనిపించడం లేదని ఉద్యోగ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తు సమయంలో రవీంద్రతో వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందేమోననే భయంతో జులై 31న తన భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో రవీంద్ర తనపై అత్యాచారం చేశాడని మరో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో రవీంద్ర వీడియోలు తీసి బయటకు చెబితే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని పోలీసులకు చెప్పింది.
సోనీ దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విక్రమ్‌ను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. సోనీ దేవితో వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని చెప్పాడు. దీంతో రవీంద్ర, సోనీ దేవితోపాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
రవీంద్ర, సోనీ దేవి మధ్య ఏడాది క్రితం నుంచే వివాహేతర సంబంధం కొనసాగుతుందని పోలీసుల విచారణలో తేలింది. రవీంద్ర తాము సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోను చిత్రీకరించాడని, ఆ వీడియోను తన కుమార్తె అనుకోకుండా అతని ఫోన్లో చూసిందని, ఆ తరువాత విక్రమ్‌కు సమాచారం ఇచ్చిందని, అందుకే హత్య చేశామని పోలీసులకు సోనీ దేవి తెలిపింది.