Hyderabad : దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ

అత్తాపూర్ లో 35 ఏళ్ల శివాని అనే మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు

Hyderabad (1)

Hyderabad : హైదరాబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అత్తాపూర్ లో 35 ఏళ్ల శివాని అనే మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఏప్రిల్11 ఉదయం శివాని ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చారు. దేవుడు చెప్పాడంటూ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అయితే, ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం

సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్వేత హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. చికిత్స కోసం శివానిని 108 వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.