Woman Techie Dies: ఘోరాతి ఘోరం.. సాఫ్ట్‌వేర్ అమ్మాయిని సజీవ దహనం చేసిన మాజీ క్లాస్‌మెట్
అప్పట్లో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే, కొన్నాళ్లకు వెట్రి మణిమారన్ ట్రాన్స్‌జెండర్ అని నందినికి తెలిసింది. మరో అబ్బాయితో నందిని...

Woman Techie-former Classmate
Chennai: చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు జరుపుకోవాల్సిన వేళే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (24) దారుణ హత్యకు గురైంది. ఆ అమ్మాయి కాళ్లు, చేతులను కట్టేసి, ఆమెను సజీవంగా తగులబెట్టాడు మాజీ క్లాస్‌మేట్. తనతో ప్రేమను కొనసాగించకుండా మరో అబ్బాయితో ఆమె ప్రేమలో పడిందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ యువకుడు.
సాప్ట్‌వేర్ ఉద్యోగిని నందిని కాలేజీలో మదురైకు చెందిన వెట్రి మణిమారన్ అనే వ్యక్తిని ప్రేమించింది. అప్పట్లో ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే, కొన్నాళ్లకు వెట్రి మణిమారన్ ట్రాన్స్‌జెండర్ అని నందినికి తెలిసింది. గతంలో అతడి పేరు మహేశ్వరి అని తెలుసుకుంది నందిని.
గత ఏడాదిగా రాహుల్ అనే మరో యువకుడిని ప్రేమిస్తోంది నందిని. దీనిపై నందిని, వెట్రి మణిమారన్ పలుసార్లు గొడవ పడ్డారు. తాను లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే నందిని తనను పెళ్లి చేసుకుంటుందని భావించిన వెట్రి మణిమారన్ గతంలోనే ఈ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. అయితే, మరో అబ్బాయితో నందిని చనువుగా ఉంటుందని వెట్రి మణిమారన్ పగ పెంచుకున్నాడు.
దీంతో ఆమెను అంతమొందించాలని ప్రణాళిక వేసుకున్న వెట్రి మరిమారన్ తనను చివరిసారిగా ఒకసారి కలవాలని చెప్పాడు. నందిని పుట్టినరోజు ఉండడంతో ఆమెకు ఒక మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు. నందినిని చెన్నై శివారులోని ఓ మారుమూల ప్రాంతానికి పిలిచి కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగులుపెట్టాడు. కేలంబక్కం సమీపంలోని తలంబూర్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
VC Sajjanar : నడిరోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ .. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్