మ‌రో నిర్భ‌య : AC బ‌స్సులో ఇద్దరు పిల్లలతో వెళ్తున్న మ‌హిళ‌పై అత్యాచారం

  • Publish Date - June 18, 2020 / 07:00 AM IST

ఎన్నో క‌ఠిన చ‌ట్టాలు..మ‌హిళ‌ల‌పై దారుణాల‌కు తెగ‌బ‌డితే క‌ఠిన శిక్ష‌లు విధిస్తాం..అని ప్ర‌భుత్వాలు, పాల‌కులు ఎన్నో హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. ఢిల్లీలో జ‌రిగిన ఓ దారుణ ఘ‌ట‌న త‌ర్వాత‌..నిర్భ‌య లాంటి క‌ఠిన‌మైన చ‌ట్టం వ‌చ్చినా..కామాంధులు ఏమాత్రం బెద‌ర‌డం లేదు. దేశంలో ప్ర‌తి చోటా మ‌హిళ‌ల‌పై దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా..యూపీలో ఓ బ‌స్సులో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ‌పై డ్రైవ‌ర్ అత్య చారానికి పాల్ప‌డ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 

25 ఏళ్లున్న మ‌హిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ప్ర‌తాప్ గ‌డ్ నుంచి నోయిడాకు వెళ్లేందుకు సిద్ధ‌మైంది. ఏసీ ప్రైవేటు బ‌స్సులో ఎక్కింది. అందులో ఉన్న డ్రైవ‌ర్లు ఈమెపై క‌న్నేశారు. ఆ స‌మ‌యంలో మ‌హిళ‌తో పాటు..మ‌రో 10 మంది ప్ర‌యాణిస్తున్నార‌ని తెలుస్తోంది. బ‌స్సులో ఇద్ద‌రు డ్రైవ‌ర్లు, ఒక సిబ్బంది ఉన్నారు. త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని నోయిడాకు చేరుకున్న భ‌ర్త‌తో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. 

ల‌క్నో – మ‌ధుర ప్రాంతంలో ఈ దారుణానికి తెగ‌బ‌డ్డార‌ని డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ వృందాశుక్లా వెల్ల‌డించారు. ఇద్ద‌రు డ్రైవ‌ర్ల‌లో ఒక‌రిని అరెస్టు చేయ‌డం జ‌రిగింద‌ని, బ‌స్సును స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. బ‌స్సు య‌జ‌మానితో పాటు, మ‌రో డ్రైవ‌ర్ ను అరెస్టు చేసేందుకు పోలీసు బృందాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

బాధితురాలిని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌న్నారు. బ‌స్సులో ప్ర‌యాణించిన వారి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌ని, వీరిని కూడా విచారిస్తామ‌న్నారు.బ‌స్సులో చివ‌రి సీటు కేటాయించార‌ని, బ‌ల‌వంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డార‌ని వృందా తెలిపారు. అలారం మోగిస్తే..తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని డ్రైవ‌ర్ బెదిరించి..దారుణానికి పాల్ప‌డ్డార‌న్నారు. 

Read: నా మనవళ్ళను కూడా సైన్యంలోకి పంపిస్తా : వీర జవాన్ కుందన్ ఓఝా తండ్రి