×
Ad

White Rice : తీవ్ర విషాదం.. తెల్లబియ్యం తేలేదని భార్య ఆత్మహత్య

హైదరాబాద్ నారాయణగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెల్లబియ్యం తేలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రౌన్‌ రైస్‌ తినలేక తెల్ల బియ్యం తేవాలని ఇంట్లో వాళ్లకు చెప్ప

  • Published On : September 1, 2021 / 10:21 PM IST

White Rice

White Rice : హైదరాబాద్ నారాయణగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెల్లబియ్యం తేలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రౌన్‌ రైస్‌ తినలేక తెల్ల బియ్యం తేవాలని ఇంట్లో వాళ్లకు చెప్పినా పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణగూడలోని దత్తానగర్‌కు చెందిన రాంబాబు, స్వప్నకు 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ఇంటర్ చదువుతున్నారు.

Tollywood Drugs Case : సినీ తారల సీక్రెట్స్ చెప్పేసిన కెల్విన్.. ఇక స్టార్స్‌కు చిక్కులే..

రాంబాబు క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్వప్న ఓ బేకరీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. నిత్యం ఇంట్లో బ్రౌన్‌ రైస్‌తో భోజనం చేస్తుంటారు. ఎప్పుడైనా తెల్లన్నం తినాలని ఉందంటే స్వప్న కోసం భర్త తెల్లబియ్యం ఒక కేజీ తెస్తుంటాడు. కాగా, కొంతకాలంగా రాంబాబు వైట్ రైస్‌ తీసుకురావడం ఆపేశాడు. దీంతో స్పప్న భర్తతో గొడవపడింది. చచ్చిపోతానని హెచ్చరించింది. అయినా, ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు… పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Bigg Boss 5 : అవన్నీ రూమర్స్.. వచ్చేస్తున్నాడు ‘బిగ్ బాస్’..