మాయమాటలు చెప్పి 13 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 06:25 AM IST
మాయమాటలు చెప్పి 13 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం

Updated On : January 29, 2020 / 6:25 AM IST

హైదరాబాద్‌ పంజాగుట్టలో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పి 13 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు ఎంఎస్‌ మక్తాలో నివాసముంటున్నారు. బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా, తల్లి ఇళ్లళ్లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జహంగీర్‌ (30) అనే యువకుడు స్థానికంగా పంచార్‌షాపు నిర్వహిస్తున్నాడు.

జహంగీర్‌ కన్ను బాలికపై పడింది. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పది రోజులగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు తెలియడంతో నిందితుడు జహాంగీర్‌ పరారయ్యాడు. బాధిత బాలిక నిన్న నీరసంగా ఉండడంతో తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించారు.

దీంతో జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. జహంగీర్‌పై బాధితురాలి తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న జహంగీర్‌ కోసం గాలిస్తున్నారు.