చంచల్‌గూడ జైలుకి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు.. 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్

తండ్రీకూతుళ్లపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి ప్రణీత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Praneeth Hanumantu Remand : యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అతడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ప్రణీత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు పోలీసులు. అతడిపై 67 బీ ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్ 79 కింద కేసులు నమోదు చేశారు. మరో ముగ్గురు నిందితులపైనా కేసులు నమోదయ్యాయి. ఏ2గా డల్లాస్ నాగేశ్వరరావు, ఏ3గా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణ పేర్లను చేర్చారు.

తండ్రీకూతుళ్ల బంధంపైన చర్చ పెట్టి విషం చిమ్మిన ప్రణీత్ ను పీటీ వారెంట్ పై బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు.. అతడిని రహస్య ప్రాంతంలో విచారించారు. ప్రణీత్ తీరును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం సీరియస్ గా తీసుకుంది. ఎక్స్ లో వచ్చిన పోస్టులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. హనుమంతుపై కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

ప్రణీత్ నిన్న బెంగళూరులో అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రీకూతుళ్లపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి ప్రణీత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రణీత్ తో పాటు మరో ముగ్గురిపైనా కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.

తండ్రి, కూతురు బంధంపై ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనాల్లో ఏ స్థాయి కోపం ఉందంటే.. ప్రణీత్ తల్లిదండ్రులను సైతం టార్గెట్ చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ప్రణీత్.. తాను మంచి కొడుకును కాకపోయినా.. తన పేరెంట్స్ మంచి వారని, దయచేసి వారిని ఏమీ అనొద్దని వేడుకున్నారు.

Also Read : ప్రేమోన్మాది ఘాతుకం.. నర్సంపేట ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు.. అసలేం జరిగింది?

ట్రెండింగ్ వార్తలు