1005 students from Telugu states get Reliance Foundation UG Scholarships
Reliance Foundation UG Scholarships : భారత్‌లో అతిపెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటైన రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ 2023-24 ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 5 వేల మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దీని ఫలితాలు ఫిబ్రవరి 9న (శుక్రవారం) వెల్లడయ్యాయి. భారత్‌లోని 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 5,500 కన్నా ఎక్కువ విద్యాసంస్థల్లో చదువుతున్న 58వేల మంది విద్యార్థులు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెరిట్ కమ్ మీన్స్ ప్రక్రియ ద్వారా 5 వేల మందిని ఎంపిక చేశారు.
5 వేల మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి 1005 మంది విద్యార్థులు:
ఎంపికైన 5వేల మందిలో 4,984 విద్యా సంస్థల నుంచి 51శాతం మంది బాలికలు ఉన్నారు. 99 మంది దివ్యాంగ విద్యార్థులు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1005 మంది విద్యార్థులు ఎంపిక కాగా వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 657 మంది, తెలంగాణ నుంచి 348 మంది విద్యార్థులు ఉన్నారు. దరఖాస్తుదారులు (www.reliancefoundation.org )ని విజిట్ చేయడం ద్వారా తమ దరఖాస్తుల ఫలితాన్ని చెక్ చేయవచ్చు.
దరఖాస్తుకు ఎవరు అర్హులంటే? :
ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విద్యార్థుల పనితీరు, వారి గ్రేడ్ 12 మార్కులతో పాటు, ఎంపికైన విద్యార్థులలో 75 శాతం మంది వార్షిక కుటుంబ ఆదాయం 2.5 లక్షల కన్నా తక్కువగా ఉంది. దీని ఆధారంగానే ప్రతిభావంతులైన విద్యార్థులను రిలయన్స్ యూజీ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేశారు.
ఎంపికైనా మొదటి సంవత్సరం యూజీ విద్యార్థులకు కోర్సు వ్యవధిలో రూ. 2 లక్షలు స్కాలర్‌షిప్‌గా పొందుతారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల నుంచి ఈ స్ట్రీమ్‌లలో ఇంజనీరింగ్/టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, కామర్స్, ఆర్ట్స్, లా, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చర్, బిజినెస్/మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇతర ప్రొఫెషనల్ డిగ్రీలలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అంటే ఏమిటి? :
రిలయన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు దివంగత ధీరూభాయ్ అంబానీ 90వ జయంతి సందర్భంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రొగ్రామ్ ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు లేదా అంతకంటే తక్కువ కలిగిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అర్హులు. 1996 నుంచి అర్హులైన విద్యార్థులందరికి ఈ స్కాలర్‌షిప్ అందిస్తోంది.
ఇప్పటివరకూ రిలయన్స్ ఫౌండేషన్ 23,136 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేసింది. 48 శాతం మహిళా విద్యార్థులు ఉండగా. 3,001 మంది వికలాంగ విద్యార్థులు ఉన్నారు. గత డిసెంబర్ 2022లో వ్యవస్థాపక-ఛైర్మన్ ధీరూభాయ్ అంబానీ 90వ జన్మదినోత్సవం సందర్భంగా.. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్‌పర్సన్ నీతా అంబానీ వచ్చే దశాబ్దంలో 50 వేల స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేయబోతున్నట్లు ప్రకటించారు.
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ఫలితాలను ఇలా చెక్ చేయండి :