ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 311 ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
వయస్సు:
అభ్యర్ధులు 26 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతం:
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు నెలకు రూ.15 వేలు, డిప్లొమా అప్రెంటీస్ కు నెలకు రూ.12వేలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 2019, ఆగస్ట్ 26.
దరఖాస్తుకు చివరి తేదీ: 2019, సెప్టెంబర్ 20.