CITD Admission : హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లో ప్రవేశాలు
ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు గా నిర్ణయించారు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. టూల్ డిజైన్, మెకట్రానిక్స్ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ ప్రోగ్రామ్‌నకు సహకారం అందిస్తుంది.

Admissions in Master of Engineering Program at Central Institute of Tool Design, Hyderabad
CITD Admission : హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) – మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్(ఎంఈ) ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు జరగనున్నాయి. ఇందుకుగాను ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు గా నిర్ణయించారు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. టూల్ డిజైన్, మెకట్రానిక్స్ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ ప్రోగ్రామ్‌నకు సహకారం అందిస్తుంది. అర్హతల విషయానికి వస్తే టూల్ డిజైన్ స్పెషలైజేషన్‌కు బీఈ/ బీటెక్(మెకానికల్/ ప్రొడక్షన్/ మెకట్రానిక్స్), మెకట్రానిక్స్ స్పెషలైజేషన్‌కు సంబంధించి బీఈ/ బీటెక్(మెకానికల్/ ఈసీఈ/ ఈఈఈ/ ఈఐఈ/ మెకట్రానిక్స్/ ఆటొమొబైల్ / ఏరోనాటికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి.
అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూలకు చివరి తేదీ అక్టోబరు 31, 2022 గా నిర్ణయించారు. వేదిక: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, బాలానగర్, హైదరాబాద్ – 500037. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.citdindia.org పరిశీలించగలరు.