NIT Andhra Pradesh PhD Admission
NIT Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్ ఆంధ్ర)లో రీసెర్చ్ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంఎస్(రీసెర్చ్), పీహెచ్‌డీ 2023 డిసెంబరు సెషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పీహెచ్‌డీలో ఫుల్ టైం, పార్ట్ టైం, అండర్ ప్రాజెక్ట్ కేటగిరీలు ఉన్నాయి. రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పీహెచ్‌డీ ఫుల్ టైం అభ్యర్థులకు హాఫ్ టైం రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్(హెచ్‌టీఆర్‌ఏ) అందిస్తారు.
పీహెచ్‌డీ విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, సైన్సెస్, మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మేనేజ్‌మెంట్ విభాగాలు ఉన్నాయి.
ఎంఎస్(రీసెర్చ్) విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ విభాగాలు ఉన్నాయి.
READ ALSO : Andhra University : ఆంధ్రా యూనివర్శిటీకి నాక్ A++ గ్రేడ్ గుర్తింపు
అర్హతలు ;
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధిత స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులులతోపాటు నెట్/గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. డీఎస్టీ/సీఎస్ ఐఆర్/యూజీసీ/ఎన్‌బీహెచ్‌ఎం నుంచి ఫెలోషిప్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. పార్ట్ టైం అభ్యర్థులకు రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లు,అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్‌లు,ఇండస్ట్రీలలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
అలాగే ఎంఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లు/అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్‌లు,ఇండస్ట్రీలలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.1,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
డిసెంబరు 1, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nitandhra.ac.in పరిశీలించగలరు.