FTII ఐదు కోర్సులకు AICTE అనుమతి

పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో మరో ఐదు కొత్త కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్ (AICTE) అనుమతి ఇచ్చింది. అప్లైడ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ కేటగిరీలో IITకి చెందిన ఐదు కోర్సులకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు.
భారతదేశంలో మొట్టమొదటి గుర్తింపు పొందిన ఒకే ఒక్క సంస్థగా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిలిచింది అని FTII పాలక మండలి చైర్మన్ బ్రిజేంద్ర పాల్ సింగ్ చెప్పారు. ఈ ఐదు FTII కోర్సులలో నాలుగు టెలివిజన్ వింగ్ కి చెందినవి ( డైరెక్షన్, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫి, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, టీవీ ఇంజినీరింగ్). ఇంకోటి ఫిల్మ్స్ కాటగిరి( ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్ రైటింగ్).