అలహాబాద్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు
అలహాబాద్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అలహాబాద్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అలహాబాద్ బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సెక్యూరిటీ ఆఫీసర్, సివిల్ ఇంజినీర్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్షియల్ అనలిస్ట్ పోస్టులతోపాటు పలు విభాగాల్లో మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యా అర్హతలు నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
Read Also : బీభత్సం : పూతలపట్టు వైసీపీ అభ్యర్థి బాబుపై దాడి
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. అంతేకాదు ఏప్రిల్ 29లోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. SC, ST, దివ్యాంగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్ధులు ఏప్రిల్ 1వ తేది, 2019 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయసు పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
విద్యా అర్హత:
అభ్యర్ధులు BSC, LLB, PG, MBA, B-TECH సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి.
Read Also : EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ