ALLEN: మీరు పీజీ మెడికల్ ఆశావహులా.. అయితే ఈ యాప్ మీకోసమే
పీజీ మెడికల్ విద్యార్థుల జీవితం అత్యంత సవాల్‌తో కూడుకున్నది. అస్సలు ఖాళీ లేని రీతిలో ఉండే వారి ఇంటెర్న్‌షిప్ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ చేయడంతో పాటుగా పరీక్షలకు సిద్ధం కావడం చాలా కష్టమైన అంశం. అయితే ALLEN NExT యాప్ విడుదలతో పాటుగా సమగ్రమైన కోర్సు ప్యాకేజీలు ఆల్ఫా, బీటా, డెల్టాలతో వైద్య పీజీ విద్యార్ధులు పరీక్షలకు సిద్ధమయ్యే విధానం సమూలంగా మార్చనుంది

ALLEN
ALLEN: భారతదేశవ్యాప్తంగా మెడికల్ కోచింగ్‌లో అగ్రగామి సంస్ధలలో ఒకటైన ALLEN, తమ ALLEN NExT App ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. NEET-PG, INI-CET, FMGE పరీక్షల ప్రిపరేషన్ కోసం సమగ్రమైన పరిష్కారంగా పీజీ మెడికల్ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దినట్లు దేశంలోనే ప్రముఖ కోచింగ్ సెంటరు నగరంగా ప్రఖ్యాతి గాంచిన కోటాకు చెందిన ఈ యాప్ యాజమాన్యం తెలిపింది. ఈ యాప్ విస్తృత శ్రేణిలో వినూత్న ఫీచర్లను, వనరులను అందిస్తుంది. ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర పరీక్షా ప్రిపరేషన్ ప్లాట్‌ఫామ్స్‌కు భిన్నంగా ఉంటుంది.
ఈ విషయమై ALLEN NExT Vertical హోల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ అమన్ మహేశ్వరి మాట్లాడుతూ ‘‘వైద్య ప్రవేశ పరీక్ష సన్నద్ధత ప్రక్రియను సరళంగా వారి హడావుడి షెడ్యూల్స్‌తో సంబంధం లేకుండా ఆ విద్యార్థులకు మరింత అందుబాటులో ఉండేలా ALLEN NExT యాప్ తీర్చిదిద్దాము. NEET-PG, INI-CET, FMGE పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించేలా సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను అందించడం ద్వారా, పీజీ మెడికల్ విద్యార్ధులు తమ విద్య, ప్రొఫెషనల్ లక్ష్యాలను అతి సులభంగా సాధించేలా తోడ్పడటం లక్ష్యంగా చేసుకున్నాము’’ అని అన్నారు.
పీజీ మెడికల్ విద్యార్థుల జీవితం అత్యంత సవాల్‌తో కూడుకున్నది. అస్సలు ఖాళీ లేని రీతిలో ఉండే వారి ఇంటెర్న్‌షిప్ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ చేయడంతో పాటుగా పరీక్షలకు సిద్ధం కావడం చాలా కష్టమైన అంశం. అయితే ALLEN NExT యాప్ విడుదలతో పాటుగా సమగ్రమైన కోర్సు ప్యాకేజీలు ఆల్ఫా, బీటా, డెల్టాలతో వైద్య పీజీ విద్యార్ధులు పరీక్షలకు సిద్ధమయ్యే విధానం సమూలంగా మార్చనుంది. బహుళ వనరులపై ఆధారపడాల్సిన ఆవశ్యకతను ఈ యాప్ తొలగించడంతో పాటుగా ప్రత్యేకమైన స్టార్ ఫ్యాకల్టీల నుంచి సంక్షిప్త విద్యావిషయాలను సైతం అందిస్తుంది. మూడు సమగ్రమైన కోర్సు ప్యాకేజీలు –ఆల్ఫా, బీటా, డెల్టా –విద్యార్ధుల వైవిధ్యమైన అవసరాలను తీర్చడంతో పాటుగా తమ ప్రిపరేషన్స్ కోసం అత్యుత్తమ వనరులను పొందేందుకు భరోసా అందిస్తుంది.