AP Mega DCS 2025: ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.. మరిన్ని వివరాలు మీకోసం

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్షల వాయిదా పడ్డాయి.

Ap DSC 2025

AP Mega DCS 2025 Exams: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామక పరీక్షల వాయిదా పడ్డాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ కారణంగానే డీఎస్సీ పరిక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. Also Read: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్.. నెలకు రూ.5 వేల భత్యం.. ఇలా అప్లై చేసుకోండి

ఈమేరకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శనివారం(జూన్ 15) అధికారిక ప్రకటన చేశారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు సవరించిన హాల్‌టికెట్లను జూన్ 25వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఈ హాల్‌టికెట్లలో మార్చిన తేదీలు, కొత్త పరీక్షా కేంద్రాల వివరాలు స్పష్టంగా ఉంటాయని తెలిపారు.