UPSC Free Coaching: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్.. నెలకు రూ.5 వేల భత్యం.. ఇలా అప్లై చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్ సర్వీసెస్ 2026 లాంగ్ టర్మ్ కోచింగ్ ఉచితంగా అందించనుంది.

UPSC Coaching
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్ సర్వీసెస్ 2026 లాంగ్ టర్మ్ కోచింగ్ ఉచితంగా అందించనుంది. ఈ శిక్షణ జులై 23, 2025 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు హైదరాబాద్ లో కొనసాగనుంది. మొత్తం 150 మందికి ఉచిత శిక్షణ అందించనున్నారు. సివిల్ సర్వీస్ లో సేవలు అందించాలనుకునే యువతను ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.
అర్హత: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, పెద్దపెల్లి ప్రాంతాల్లో గల డిగ్రీ పూర్తి చేసిన BC, SC, ST, OBC అభ్యర్థులు దరకాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఈ ఉచిత శిక్షణ కోసం మొత్తం 150 మందిని ఎంపిక చేస్తారు. అందులో.. గతంలో UPSC ప్రిలిమ్స్ పరీక్ష ఉత్తీర్ణులైన వారి నుండి 50 మందిని తీసుకుంటారు. మిగతా 100 మందికోసం ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్ష జులై 12న ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారిని నేరుగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు 16 జూన్ 2025 నుంచి 08 జూన్ 2025 మధ్యలో అధికారిక వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే UPSC ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలతో 08 జులై 2025 లోగా హైదరాబాద్ లోని TG BC Study Circle లో దరఖాస్తు చేసుకోవాలి.
శిక్షణ వివరాలు: శిక్షణ సమయంలో నివాసం, భోజనం, రవాణా కోసం ప్రతి నెల రూ. 5000 అందజేస్తారు. బుక్స్ కోసం రూ.5000 అందిస్తారు. ఇది ఒకేసారి మాత్రమే ఉంటుంది.