Data Entry Operator Jobs : ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 20-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

Data Entry Operator Jobs :
Data Entry Operator Jobs : ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పంచాయితీ రాజ్ శాఖ ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 మండల డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీసీఏ/ ఎంసీఏ/ బీటెక్(సీఎస్‌ఈ/ ఈసీఈ/ ఈఈఈ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేష్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 20-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://westgodavari.ap.gov.in/ పరిశీలించగలరు.