Cancer : క్యాన్సర్ బాధితులకు అడపాదడపా ఉపవాసం వల్ల మెరుగైన ఆరోగ్యం.. ఎలా అంటే ?

Cancer : క్యాన్సర్ బాధితులలో అడపాదడపా ఉపవాసం (Intermittent Fasting) ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Cancer : క్యాన్సర్ బాధితులకు అడపాదడపా ఉపవాసం వల్ల మెరుగైన ఆరోగ్యం.. ఎలా అంటే ?

Cancer

Updated On : August 28, 2025 / 12:08 AM IST

Cancer : క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధి. గతంలో వృద్ధాప్యంలో వచ్చే జబ్బుగా క్యాన్సన్‌ను భావించేవారు. కానీ, ప్రస్తుత కాలంలో 30 – 40 ఏళ్ల వయస్సు వారిని కూడా క్యాన్స్ వెంటాడుతోంది. 2024లో భారత దేశంలో 15.6లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదైనట్లు.. 8.74లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనం తెలిపింది.

క్యాన్సర్ బాధితులలో అడపాదడపా ఉపవాసం (Intermittent Fasting) ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళా ఆరోగ్య కోచ్ డిలాన్.. గత పదిహేనేళ్లకుపైగా ప్రతిరోజూ అడపాదడపా ఉపవాసం పాటిస్తున్నాడు. ఉదయం అల్పాహారం తినకపోవడం, చిరుతిళ్లు తినకపోవటం వంటి వాటితో క్యాన్సర్ ను నియంత్రించడంలో తన ప్రయాణానికి ఎలా సహాయపడిందో ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు.

క్యాన్సర్ నిర్ధారణ అయిన తరువాత డిలాన్ అడపాదడపా ఉపవాసం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి స్థాయిలు, నిద్ర.. ప్రతిదీ తన దినచర్యలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. శరీరానికి ఎప్పుడూ విరామం లేనప్పుడు ఏమి జరుగుతుందో నేను నేర్చుకున్నాను అంటూ అతను వివరించారు. మీరు నిరంతరం ఆహారం ఇస్తున్నప్పుడు మీ శరీరం నిరంతరం జీర్ణం చేసుకుంటూ ఉంటుంది. ఈ నిరంతర జీర్ణక్రియ స్థితి శరీరం తనను తాను మరమ్మతు చేసుకోకుండా నిరోధిస్తుందని, కణ పునరుద్దరణకు తక్కువ అవకాశం ఉంటుందని అన్నారు.

మీరు రోజులో కొంత సమయం ఉపవాసం ఉన్నప్పుడు.. మన శరీరంలో శక్తివంతమైనది ఏదో ఒకటి పనిచేస్తుంది. దీనిని ఆటోఫాగి అంటారని డిలాన్ చెప్పాడు. ఇది శరీరంలో దెబ్బతిన్న కణాలను శుభ్రపరిచే శరీరం యొక్క సహజ ప్రక్రియ. ఇది క్యాన్సర్ చికిత్స నిరోధకతలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వాపు తగ్గుతుంది. హార్మోన్లు తిరిగి సమతుల్యం అవుతాయి. మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. చాలా మంది మేల్కొన్న క్షణం నుండి పడుకునే నిమిషం వరకు నిత్యం తింటూనే ఉంటారు. అలాంటి సమయంలో మీ శరీరానికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఎప్పుడు దొరుకుతుంది. అయితే, అడపాదడపా ఉపవాసం నా జీవితాన్ని మార్చేసిందని డిలాన్ అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dilan | Women’s Health Coach (@dnafitnessuk)