ANGRU Recruitment: నిరుద్యోగులకు శుభవార్త. నంద్యాలలోని అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్ (ANGRAU) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా మొత్తం 15 టీచింగ్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీన ఇంటర్వ్యూకు హాజరువుకావాలని(ANGRU Recruitment) అధికారులు సూచించారు. ఇక దీనికి సంబందించిన అధికారిక వెబ్ సైట్ angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx ద్వారా తెలుసుకోవచ్చు.
TTC Results: తెలంగాణ టీటీసీ ఫలితాలు విడుదల: మీ ఫలితాలు ఇలా తెలుసుకోండి
పోస్టులు, ఖాళీల వివరాలు:
- టీచింగ్ అసోసియేట్స్ పోస్టులు 03
- టీచింగ్ అసిస్టెంట్స్ పోస్టులు 12
విద్యార్హత:
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ /పీహెచ్‌డీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- టీచింగ్ అసోసియేట్స్ పోస్టులకు పురుషులు 40 ఏళ్లు, మహిళలు 45 ఏళ్లు మించకూడదు
- టీచింగ్ అసిస్టెంట్స్ పోస్టులకు 35 ఏళ్ల మించకూడదు
వేతన వివరాలు:
- టీచింగ్ అసోసియేట్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.61,000 నుంచి రూ.67,000 వరకు జీతం అందుతుంది.
- టీచింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 వరకు జీతం అందుతుంది.