AP District Court Jobs: మీరు 7వ తరగతి పాసయ్యారా.. నెలకు రూ.44 వేల జీతం.. ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కోర్టులో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు(AP District Court Jobs) వివిధ విభాగాల పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ దరఖాస్తులను కోరుతోంది.

AP District Court Jobs with 7th Class Qualification

AP District Court Jobs: మీరు 7వ తరగతి పాసయ్యారా. అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ఆంధ్రప్రదేశ్‌లోని(AP District Court Jobs) పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులోని వివిధ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతోంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 12 వరకు కొనసాగనుంది. కాబట్టి, అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ westgodavari.dcourts.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC CGL Exams: ఎస్ఎస్సీ కీలక అప్డేట్.. సీజీఎల్ టైర్ 1 పరీక్షల షెడ్యూల్ విడుదల.. అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి.

పోస్టులు, ఖాళీల వివరాలు:

  • హెడ్‌ క్లర్క్ పోస్టులు 03
  • జూనియర్ అసిస్టెంట్ కమ్-టైపిస్ట్ పోస్టులు 03
  • స్టెనో కమ్-టైపిస్ట్ పోస్టులు 02
  • అటెండర్ పోస్టులు 03

విద్యార్హతలు:
పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతన వివరాలు;
వివిధ విభాగాలను బట్టి వేతనాల్లో మార్పులు ఉన్నాయి.

  • హెడ్‌ క్లర్క్: రూ.44,570
  • జూనియర్ అసిస్టెంట్ కమ్-టైపిస్ట్: రూ.25,220
  • స్టెనో కమ్-టైపిస్ట్: రూ.34,580
  • అటెండర్: రూ.20,000.