SSC CGL Exams: ఎస్ఎస్సీ కీలక అప్డేట్.. సీజీఎల్ టైర్ 1 పరీక్షల షెడ్యూల్ విడుదల.. అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్(SSC CGL Exams) టైర్-I 2025 పరీక్ష తేదీలపై అధికారిక ప్రకటన చేసింది.

SSC CGL Exams: ఎస్ఎస్సీ కీలక అప్డేట్.. సీజీఎల్ టైర్ 1 పరీక్షల షెడ్యూల్ విడుదల.. అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి.

SSC CGL Exam: Staff Selection Commission released CGL Tier 1 exam schedule

Updated On : September 4, 2025 / 11:03 AM IST

SSC CGL Exams: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక అప్డేట్ ఇచ్చింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) టైర్-I 2025 పరీక్షలకు సంబంధించిన తేదీలపై అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 26 వరకు జరుగుతాయని తెలిపింది. అయితే.. కొన్ని (SSC CGL Exams)సాంకేతిక, కొన్ని ఇతర కారణాల వల్ల గతంలో ఈ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చు.

Police Recruitment Board: తెలంగాణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులు.. నెలకు రూ.1.33 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు వివరాలు

అడ్మిట్ కార్డు వివరాలు:

  • సిటీ ఇన్టిమేషన్ స్లిప్: దీనిని పరీక్షకు దాదాపు 10 రోజుల ముందు విడుదల చేస్తారు.
  • అడ్మిట్ కార్డు: దీనిని పరీక్షకు 4 రోజుల ముందు విడుదల చేస్తారు.

అభ్యర్థులు తమ రోల్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా అధికారిక పోర్టల్ నుంచి అడ్మిట్ కార్డును పొందవచ్చు.

SSC CGL టైర్ 1 పరీక్షా విధానం:

  • ఈ టైర్ 1 పరీక్షలో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. మొత్తం నాలుగు విభాగాలుగా ఉంటుంది.
  • జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ విభాగంలో 25 ప్రశ్నలు
  • జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 25 ప్రశ్నలు
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో 25 ప్రశ్నలు
  • ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి.