AP EAPCET Results 2025: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2025 రిజల్ట్స్ ను సాయంత్రం రిలీజ్ చేశారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. 75.67శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈఏపీసెట్ నిర్వహించిన 12 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం.
ఈ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో కాకినాడ జేఎన్‌టీయూ (JNTUK) నిర్వహించింది. ఏపీ, హైదరాబాద్‌లో మొత్తంగా 145 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 3,62,448 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509 మంది (75.67% ఉత్తీర్ణత) అర్హత సాధించారు.
మే 19 నుంచి 20 వరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. 75, 460 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది (89.80శాతం) అర్హత సాధించారు. మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి 10 సెషన్లలో పరీక్ష జరిగింది. 2,64,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది (71.65శాతం) అర్హత సాధించారు.
Also Read: ఇంటర్ తోనే జాబ్స్.. నేషనల్ డిఫెన్స్ లో అవకాశాలు.. రూ.70 వేలు జీతం
పరీక్ష రాసిన అభ్యర్థులు తమ AP EAMCET ర్యాంక్ కార్డ్ 2025 ను అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in నుండి తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ ఫలితాలను ‘APSCHE myCET’ మొబైల్ యాప్ ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. మార్కుల మెమోను తనిఖీ చేయడానికి, వారు తమ రిజిస్ట్రేషన్ నంబర్, EAPCET హాల్ టికెట్ నంబర్. పుట్టిన తేదీని నమోదు చేయాలి.
టాపర్స్ వీరే..
ఇంజినీరింగ్ : అనిరుధ్ రెడ్డి, భాను చరణ్ రెడ్డి, యశ్వంత్
అగ్రికల్చర్, ఫార్మసీ: సాయి హర్షవర్దన్, నిశాంత్ రెడ్డి, మల్లేశ్ కుమార్
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..స్టెప్ బై స్టెప్
* అధికారిక వెబ్ సైట్ కి cets.apsche.ap.gov.in వెళ్లాలి
* హోమ్ పేజీలో కనిపించే ‘AP EAPCET 2025’ పై క్లిక్ చేయాలి
* తర్వాత రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి
* లాగిన్ డీటైల్స్ ఇవ్వాలి(రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్).. వ్యూ రిజల్ట్ పై క్లిక్ చేయాలి
* స్క్రీన్ పై ఏపీ ఎంసెట్ మార్క్ మెమో కనిపిస్తుంది
* దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..
ఈఏపీసెట్‌లో 75.67శాతం ఉత్తీర్ణత.
ఇంజినీరింగ్‌లో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత.
అగ్రి, ఫార్మసీ విభాగంలో 89.8శాతం ఉత్తీర్ణత.
అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,761 మంది ఉత్తీర్ణత.
* ఇంజినీరింగ్ విభాగంలో 7.89 లక్షల మంది ఉత్తీర్ణత.. అగ్రి, ఫార్మసీ విభాగంలో 67, 761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత.
ఇంజినీరింగ్ విభాగంలో టాపర్స్..
మొదటి ర్యాంక్.. అనిరుధ్ రెడ్డి (హైదరాబాద్)
రెండో ర్యాంక్.. భాను చరణ్‌రెడ్డి (శ్రీకాళహస్తి)
మూడో ర్యాంక్.. యశ్వంత్
నాలుగో ర్యాంక్.. రామ్ చరణ్‌రెడ్డి (నంద్యాల జిల్లా)
ఐదో ర్యాంక్.. భూపతి నితిన్ (అనంతపురం)
అగ్రి, ఫార్మా విభాగంలో టాపర్స్..
ఫస్ట్ ర్యాంక్ సాయి హర్షవర్ధన్ (పెనమలూరు)
రెండో ర్యాంక్.. నిశాంత్ (రంగారెడ్డి)
మూడో ర్యాంక్ – వినయ్ మల్లేష్ (కోనసీమ)
నాలుగో ర్యాంక్.. షణ్ముఖ్ (హనుమకొండ)
ఐదో ర్యాంక్.. సాయి గోవర్ధన్ (కాకినాడ)
ఇంజినీరింగ్‌లో 71.65 శాతం విద్యార్థులు ఉతీర్ణత
అగ్రి, ఫార్మసీ విభాగాల్లో 89.8 శాతం ఉత్తీర్ణత.