NDA recruitment: ఇంటర్ తోనే జాబ్స్.. నేషనల్ డిఫెన్స్ లో అవకాశాలు.. రూ.70 వేలు జీతం
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో రెండో విడతలో 406 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

NDA jobs 2025
దేశ సేవే లక్ష్యంగా పని చేయాలని చాలా మంది కోరికగా ఉంటారు. అలాంటి వారికోసం నేషనల్ డిఫెన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో రెండో విడతలో 406 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 28న అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జూన్ 17 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది.
విద్యార్హతలు: ఆర్మీ విభాగం కోసం 12వ తరగతి లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ / నేవీ / 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కోసం 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో పాసై ఉండాలి.
దరఖాస్తు రుసుము: సాధారణ, OBC అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళా అభ్యర్థులు, JCOs, NCOs, ORs వారికి ఎలాంటి రుసుము లేదు.
పరీక్ష విధానం: రెండు భాగాలుగా రాత పరీక్ష ఉంటుంది. ఉత్తీర్ణులైన అభ్యర్థులు SSB ఇంటర్వ్యూకు ఎంపిక అవుతారు.
జీతం వివరాలు: ట్రైనింగ్ సమయంలో రూ.56,100 స్టైపెండ్. పోస్టింగ్ తర్వాత రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు ఉంటుంది.