Ap Forest Jobs: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవగా తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షల కోసం హాల్ టికెట్లు విడుదల చేశారు అధికారులు. ఇక ఈ నోటిఫికేషన్ లో భాగంగా బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని(Ap Forest Jobs) ఏపీపీఎస్సీ తెలిపింది.
మీ హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ లోకి వెళ్లాలి.
హోం పేజీలో డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తరువాత OTPR ఐడీతో పాటు పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి స్క్రీన్ పై హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
దానిని ప్రింట్/ డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.